Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చందానగర్
జీహెచ్ఎంసీ వార్డు కమిటీలను నియమించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని బీజేపీ నాయకులు బొబ్బ నవతరెడ్డి అన్నారు. సోమవారం గవర్నర్ తమిలిసై సౌం దర్య రాజన్ కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సం దర్భంగా మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతరెడ్డి మాట్లాడు తూ భారత రాజ్యగం ఆర్టికల్ 243-ఎస్ ప్రకారం, తెలంగాణ ప్రభుత్య మున్సిపల్ చట్టం 2019 సెక్షన్ 17 ప్రకారం జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల హక్కులను, నియమ, నిబంధనలను నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. స్థానిక సంస్థల వార్డ్ కమిటీల ద్వారా ఖర్చు పెట్టవల్సిన అభివృద్ధి నిధులను ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి తమ ఇష్టారాజ్యంగా ఉపయోగించి దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. వెంటనే వార్డ్ కమిటీలను నియమించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ చందానగర్ డివిజన్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ శోభ, మాజీ వార్డ్ మెంబర్ రమణ కుమారి, రాధిక తదితరులు పాల్గొన్నారు.