Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం
- నీట మునిగిన పంట పొలాలు స్తంభించిన జనజీవనం
నవతెలంగాణ- బంట్వారం
మండలంలో సోమవారం కురిసిన భారీ వర్షానికి జన జీవనం అస్తవ్యస్తమైంది. 2 గంటల పాటు భారీ వర్షం కుర వడంతో చుట్టూ ఉన్న వాగులు వంకలు పొంగి పొర్లాయి. మండల పరిధిలోని యాచారంలో వర్షపు నీరు వరదల మా రి అమాంతం ఇళ్లల్లోకి చేరి పోవడంతో ఇళ్లలో ఉన్న వస్తువు లు, ధాన్యాలు తగిసిపోయి ప్రజలు ఇబ్బందులకు గురయ్యా రు. బంట్వారం నుండి సల్బత్తాపూర్ గుండా తాండూర్, వికారాబాద్కి వెళ్లే మార్గంలో సల్బత్తాపూర్ గ్రామం వద్ద ఉన్న సాకిరేవు వాగు ఉప్పొంగడంతో సల్బత్తాపూర్ తాత్కా లిక వంతెన ప్రవాహం ధాటికి కొట్టుకుపోవడంతో ప్రయా ణికులు రాకపోకలు నిలిచిపోయాయి. ఏడాది కావొస్తున్నా సల్బత్తాపూర్ వంతెన నిర్మాణ పనులు నత్తనడకన సాగ డంతో, పదే పదే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని ప్రజలు అగ్రహం వ్యక్తంచేశారు. నూరుల్లాపూర్ దగ్గరున్న వాగు ఉప్పొంగడంతో ప్రయాణికుల రాకపోకలు స్తంభిం చి, గంటల తరబడి నీటి ప్రవాహం తగ్గేంత వరకు వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేకాకుండా నూరు ల్లాపూర్ వంతెన నీటి ప్రవాహ ధాటికి శిథిలావస్తకు చేరి అసౌకర్యంగా ఉండటంతో రాకపోకలకు అంతరాయంగా మారింది. మండల కేంద్రానికి వచ్చే రాకపోకలకు ఒక్క మార్గం సరిగ్గాలేకపోవడంతో ప్రజలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనేక గ్రామాల్లో పత్తి పంట నీటిలో ము నిగిపోవడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. పంటలు పాడైపోయి రైతులు ఆర్థికంగా చితికిపోయే ప్రమా దం ఏర్పడింది. భారీ వర్షానికి బంటారం బస్ స్టాండ్ చు ట్టూ నీరు చేరిపోయి చెరువును తలపించింది. దీంతో ప్ర యాణికులు నిలుచునే చోటు లేక రోడ్డు పై నిలబడే పరిస్థితి నెలకొంది. ఎన్నో ఏళ్ల కింద నిర్మించిన బస్‌స్టాండ్, మౌలిక సదుపాయలు లేక అసౌకర్యంగా ఉందని బస్‌స్టాండ్‌లో కూర్చోలేని పరిస్థితిని నెలకొన్నది. వ్యవసాయంపై ఆధార పడి జీవనం కొనసాగించే మండల ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, రోడ్ల నిర్మాణాలకు, శిథిలావస్తలో ఉన్న స్కూల్ లు, పంట నష్టపరిహారాలు, అనేక సమస్యలు ఉన్నాయని వాటన్నిటిపై ప్రజా ప్రతినిధులు దృష్టి పెట్టి తీర్చాలని ప్రజ లు కోరుతున్నారు.