Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేల ఎకరాల్లో నీటమునిగిన పంటలు ఆందోళనలో రైతులు
నవతెలంగాణ-మర్పల్లి
కొద్ది రోజులుగా కురుస్తున్న వరుస వర్షాలకు పంటలన్నీ నీట మునిగి రైతులకు కన్నీరు పెట్టిస్తోం ది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మం డల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో వేల ఎకరా ల్లో పత్తి, మొక్కజొన్న, సోయా, కంది, మినుము, పె సరి, జొన్న వంటి పంటలు పూర్తిగా నీట మునిగి రై తులు నష్టపోయారు. లక్షల రూపాయల పెట్టుబడు లు పెట్టి సాగు చేసిన పంటలు కండ్ల ముందే నీట మునిగిపోతుంటే రైతన్నల కంట కన్నీరు తిరుగుతోం ది. వర్షాధార పంటలనే నమ్ముకుని జీవనం కొనసాగి స్తున్న రైతులకు వరుస వర్షాలు తీవ్రనష్టం కలిగిస్తోం ది. ఇప్పటికే కొన్ని వందల ఎకరాల్లో పంటలు పూర్తి గా నష్టపోయాయి. ఎన్నో ఆశలు పెట్టుకుని సాగు చే సిన పంటలు పూర్తిగా నష్టపోయాయి. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేదని తమ బతు కు దెరువు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. కనీసం వేరే వంటలు కూడా సాగు చేసేం దుకు వీలు లేకుండా పోయిందన్నారు. ఖరీ దైన పం ట పెట్టుబడులతో పంటలు సాగు చేస్తే వరుస వర్షా లు రైతులను ముంచాయని రైతులు ఆందోళన వ్య క్తం చేస్తున్నారు.
5 వేల ఎకరాల్లో నీరు నిలిచి ఉంది
మండల వ్యవసాయ అధికారి వసంత
వరసగా కురుస్తున్న వర్షాలకు మండలంలో సు మారు 5 వేల ఎకరాల్లో ఆయా పంటలు నీట ముని గి ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి వసంత తెలిపారు. మంగళవారం మండలంలోని ఆయా గ్రా మాల్లో నీట మునిగిన పంట పొలాలను ఆమె పరి శీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు కల్కూడ, మ ర్పల్లి, కోతులపురం, క్లస్టర్లలోని గ్రామాల్లో నీరు నిలి చిన పంటపొలాలను పరిశీలించామన్నారు. నీరు ని లిచిన పంటలు ఎర్ర బారుతున్నాయని అన్నారు. మండలంలో 17 వేల ఎకరాల్లో పత్తి, 6 వేల ఎక రాల్లో కంది, 14 వందల ఎకరాల్లో మొక్కజొన్న, 4 వందల ఎకరాల్లో సోయా, పంటలను రైతులు సాగు చేస్తున్నారని ఆమె తెలిపారు. వర్షాలకు పంటలు నీ ట మునగడం, నీరు నిలిచిందన్నారు. సుమారు 4వేల ఎకరాల్లో పత్తి, 150 ఎకరాల్లో సోయా, 2 వం దల ఎకరాల్లో మొక్కజొన్న, పంటలతో పాటు మరో రెండు వందల ఎకరాల్లో చిరుధాన్యాల పంటలు నీట మునిగి ఉంటాయని సుమారు 35 శాతం పంటలు దెబ్బతిని ఉంటాయన్నారు. ఇప్పటికైనా రైతులు పొలాల్లో నిలిచి ఉన్న నీటిని బయటకు పంపితే కొంత వరకు కాపాడుకోవచ్చన్నారు.
పంట నీట మునిగి బతుకు భారమైంది
తనకున్న రెండు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాను. కురుస్తున్న వర్షాలకు పంట పూర్తిగా నీట మునిగి నష్టపోయింది. రూ. 30 వేల పెట్టు బడి పెట్టి మొక్కజొన్న పంటసాగు చేస్తే వర్షాల కు పంట పూర్తిగా నీట మునిగి పూర్తిగా నష్టపో యింది. కనీసం వేరే పంట సాగు చేద్దామన్నా పొ లంలో నిండా నీరు నిలిచి ఉంది. ఈ సంవత్సరం సాగుచేసిన ఖరీఫ్ పంటలు చేతికి రాకుండా పో యాయి. తన పొలం పక్కనే ఉన్న వడ్ల వెంకటేశం, ఫుల్మద్ది రాచన్న, వడ్ల బ్రహ్మం తదితర రైతుల పొలాల్లోనూ నీరు నిలిచి పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలి మా బతుకుదెరువు ఎలా కొనసాగేది.
- ప్రభు రైతు, మర్పల్లి