Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం వెంకటయ్య
నవతెలంగాణ-పరిగి
కబ్జాదారులను కాపాడుతున్న తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు యం వెంకటయ్య అన్నారు. పరిగి మండలం, రంగాపూర్ గ్రామం లో సర్వేనెంబర్ 18లో విస్తీర్ణం 9 ఎకరాల 39గుంటలు ప్ర భుత్వ భూమిలో పేదలకు ఇంటి స్థలాలు పంచాలని ఆది వారం గుడిసెలు వేయడానికి వెళ్లిన సీపీఐ(ఎం) నాయ కులను పేదలను అరెస్టు చేసి కేసులు పెట్టి, మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులు, తహసీల్దార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సోమవారం సీపీఐ(ఎం) జిల్లా కమిటీ పిలుపుమేరకు పరిగి బస్టాండ్ దగ్గర సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాస్తారాకో నిర్వహించారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం వెంకటయ్య మాట్లాడుతూ సీపీఐ (ఎం) నాయకులు పోరాట ఫలితంగా 20 19 డిసెంబరు 17 ప్రభుత్వ భూమిగా ప్రకటిస్తూ ప్రోసిడింగ్ నెంబర్ ఆర్డర్ ఇచ్చి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నామని ప్రకటిం చారని తెలిపారు. 2019 నుంచి ఇప్పటివరకు కబ్జాదారులు 2 ఏండ్లు కబ్జాలో ఉంటే వాళ్ల మీద రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. ఈ రెండేండ్లూ భూ కబ్జాదారులపై రెవెన్యూ అధికారులు ఎందుకు చర్యలు తీసు కోలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ అధికారులు భూ కబ్జాదారులు కుమ్మక్కయ్యారని అనుమా నాలు వ్యక్తం చేశారు. కోర్టు నుండి ఎలాంటి ఆర్డర్ లేకుండా తహసీల్దార్ కోర్టు ఆర్డర్ పేరుతో కాలయాపన చేసి భూ కబ్జాదారులు, అధికార పార్టీ నాయకులకు లాభం చేకూర్చే విధంగా పరిగి తహసీల్దార్ వ్యవహరించడం సిగ్గుచేట న్నారు. ఇప్పటికైనా తహసీల్దార్ పునరాలోచించి సీపీఐ(ఎం) నాయకులు, పేదాలపై పెట్టిన కేసులను వెంటనే తొలగించి ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. లేకపోతే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పోరాటం ఆగదని అవ సరమైతే ఈ నెల 5 రంగాపూర్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వ రకు వేల మందితో పాదయాత్ర నిర్వహిస్తామని ప్రభుత్వా న్ని హెచ్చరించారు. సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బుస చంద్రయ్య, రామకృష్ణ, కొత్తూరి చెంద్రయ్య, ఎల్‌హెచ్ పిఎస్ రాష్ట్ర నాయకులు గోవింద్, మండల నాయకులు బసిరెడ్డి, ఎV్‌ా సత్యయ్య, సిహెచ్ సత్యయ్య, శేఖర్, శ్రీను, లాలప్ప, రఫీ, లక్ష్మి, శ్రీనివాస్ సజీదాబేగం పాల్గొన్నారు.