Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాండూరు రూరల్
ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుందని కొత్లాపూర్ సర్పంచ్ సాయిలు అన్నారు. సోమవారం స్థానిక పాఠశాల విద్యార్థులకు పా ఠ్య పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ బడీడు పిల్లలను బడిలో చేర్పించాలన్నారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. స్వరాష్ట్రంలో అనేక గురుకులాలను ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.