Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నవాబుపేట్
మండల కేంద్రంలో 8 రోజులుగా కొనసాగుతున్న సమ్మెలో తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మెకూ సోమ వారం ఎమ్మార్పీఎస్ నాయకులు వారికి సంపూర్ణ మద్ద తు తెలిపారు. ఇన్చార్జి రవికుమార్ మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా సమాజంలో వీఆర్ఏలు ప్రధానపాత్ర పోషిస్తున్నారని అన్నారు. ప్రభు త్వ వెంటనే స్పందించి వీఆర్ఏలకు ఇచ్చిని హామీని వెం టనే అమలు చేయాలన్నారు. అలాగే అర్హులైన వీఆర్ఏ లకు పదోన్నతులు 55 ఏండ్లు పైబడిన ఉద్యోగుల స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఉద్యో గ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల వీఆర్ఏల సంగం అధ్యక్షులు శ్రీశైలం, ఉపాధ్య క్షులు రాంచందర్ రెడ్డి, కార్యదర్శి మహేష్ కుమార్, అని ల్ కుమార్, మాణిక్ రెడ్డి, శీను, లక్ష్మీ నరసమ్మ, లలిత, ఫారుక్, గ్రామాల వీఆర్ఏలు పాల్గొన్నారు.