Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిలిచిపోయిన రాకపోకలు
నవతెలంగాణ- నవాబుపేట్
మండల పరిధిలో సోమవారం భారీగా కుండపో తగా కురిసిన వర్షానికి వాగులు పొంగి పొర్లాయి. చించల్ పేట్ మీదుగా అత్తాపూర్, అక్నాపూర్ వెళ్లే రోడ్డుపై వరద పొంగిపొర్లడంతో గంటల తరబడి రాక పోకలు నిలిచిపోయాయి. రోడ్డుపైకి భారీగా బురదచేరడంతో అటుగా వెళ్లే ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. వరద తగ్గిన తర్వాత ద్విచక్ర వాహనాలు రోడ్డు పైన జరిపడ్డాయి. ఎడ తెరిపిలేకుండ కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపోర్లడంతో గ్రామానికి సమీపంలో మూసీ వాగు పారడం వాగులు పారి మూసిలో కలవడానికి నిత్యం వివిధ గ్రామస్తులు ఇబ్బందుల ఎదుర్కోంటున్నారు. చింతల్ పేట్, అత్తాపూర్ గ్రామాలు దానికి సమీపంలోనే ఉండటంతో వాగుల పై వంతెన లేక మండల కేంద్రానికి ప్రజలు వెళ్లాలంటే కిలోమీటర్లు తిరిగి ప్రయాణం చేయాల్సి వస్తోందని గ్రామస్తులు తెలిపారు. వర్షాకాలంలో వివిధ గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు నుంచి ప్రజలను కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు. అధికారులు, నాయకులు ఇప్పటికైనా ప్రజల సమస్యలను గుర్తించి వంతెన ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.