Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-విజయవంతం చేయాలి
- సీఐటీయూ నాయకులు వాల్ పోస్టర్ విడుదల
నవతెలంగాణ-శంషాబాద్
సీఐటీయూ ఆధ్వర్యంలో ఆగస్టు 3న చలో హైదరా బాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం గోడ పత్రికను భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయూ) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కొత్తపల్లి మల్లేష్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల అడ్డాపై ఆవిష్కరిం చారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సీఐటీ యూ జిల్లా కోశాధికారి నీరటి మల్లేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం ఐదు సంవత్సరాలకు ఒకసారి కార్మికుల చట్టాల ను పెరిగిన ధరలకు అనుకూలంగా వేతనాల చట్టాలు సవరించాల్సి ఉన్నా సవరించలేదన్నారు. కార్మికుల పోరా ట ఫలితంగా 2021 జూన్ నెలలో ఐదు జీవోలను విడు దల చేసిందనప్పటికీ గెజిట్ చేయలేదనీ తెలిపారు. పెండింగ్లో ఉన్న వాటిని గెజిట్ చేయాలన్నారు. ఇంకా పరిష్కారం కానీ 68 షెడ్యూల్డ్ పరిశ్రమల కనీస వేతనాల జీవోను సవరించాలన్నారు. బీడీ, హమాలీ, భవన నిర్మా ణం, ట్రాన్స్పోర్ట్ రంగాల కార్మికులతో పాటు ఇతర కార్మికుల సమస్య లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 73 షెడ్యూల్ పరిశ్రమల కనీస వేతనాల జీవోలను సవ రించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులపై 44 రకాల కార్మిక చట్టాలను నాలుగు కోడ్లను వెంటనే రద్దు చేయా లని డిమాండ్ చేశారు. 3న చేపట్టబోయే చలో హైదరాబా ద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి స్నానం రాములు, శ్రీశైలం తదితర భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.