Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు నీరటి మల్లేష్
నవతెలంగాణ-రాజేంద్రనగర్
బడుగు, బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్య లను పరిష్కరించే వరకు పోరాటం చేసిన గొప్ప వ్యక్తి కే కృష్ణమూర్తి సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు నీరటి మల్లేష్ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా సీఐటీయూ కార్యాలయంలో కే.కృష్ణమూర్తి 16వ వర్థంతిచ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పోరాడిన గొప్ప నాయకుడని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన గొప్ప త్యాగమూర్తి అని అన్నారు. కామ్రేడ్ కే.కృష్ణమూర్తి సిద్ధాంతాలను ఆశయాలను అనుసరిస్తూ మనమంతా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజేంద్రనగర్ మండల కన్వీనర్ కురుమయ్య, గండిపేట్ మండల కన్వీనర్ రుద్రకుమార్, నీరటి నరసింహ, జె. మహేష్, జి.కుమార్, యాదగిరి, స్వప్న, యాదయ్య, నరసింహ, మల్లేష్, డి.రాజు పాల్గొన్నారు.