Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండలంలో భారీ వర్షం
- నిలిచిపోయిన రాకపోకలు
- పరిశీలించిన ఎంపీడీవో జగన్నాథ్ రెడ్డి
- అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన
నవతెలంగాణ-మర్పల్లి
మండలంలో సోమవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షాలకు ఆయా గ్రామాల్లో వాగులు ఉదృతంగా ప్రవహించి గంటల తరబడి రాకపోకలు నిలిచిపో యాయి. మండలంలోని దామస్తపూర్, సమస్తపూర్ తాండ, షాపూర్, కల్కోడగుర్రం గట్టు తాండ, రావు లపల్లి, తిమ్మాపూర్ గ్రామాల్లో సోమవారం మధ్యా హ్నం భారీ వర్షం కురవడంతో ఆ గ్రామాల్లో వాగులు ఉదృతంగా ప్రవహించి రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాల్లో ఉన్న వంటలు కొట్టుకుపోయాయి. మరికొన్ని పొలాల్లో వర్షం నీరు నిండి పంటలు మునిగిపోయాయి దామస్తాపూర్లో బక్కరెడ్డి పొలం లో రెండెకరాల పత్తి మరికొంత మంది రైతుల పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. ఆయా గ్రామాల సమీపంలోని వాగులు ఉప్పొంగి పారడం తో పొలా ల్లో ఉన్న రైతులు, ఆయా గ్రామాల నుంచి వచ్చే ప్ర యాణికులు గంటల తరబడి వేచి ఉన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎంపీడీవో జగన్నాథ్ రెడ్డి
మండలంలో సోమవారం భారీ వర్షం కురవడం తో రావులపల్లి గ్రామంలో ప్రవహిస్తున్న వాగును ఆ యన ఏపీఓ అంజిరెడ్డి, ఏపీఎం మధుకర్, కార్యదర్శి తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో పంటపొ లాలు పూర్తిగా మునిగి పోయి వాగులు ఉదృతంగా ప్రవహి స్తున్నాయి. ప్రజలు వాగులు దాటకుండా కొన్ని గ్రా మాల్లో అప్రమత్తం చేశామని ఎంపీడీవో జగన్నాథ్ రెడ్డి అన్నారు. సర్పంచులు కార్యదర్శులు గ్రామాల్లో అ ప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయా గ్రామాల్లో వా గుల వద్ద కాపలా ఉంచాలన్నారు.