Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ పెంటనోళ్ళ నరసింహ
నవతెలంగాణ-షాద్‌నగర్
ఎస్సీ వర్గీకరణ చేసేంతవరకు పోరాటం ఆగదని, మాదిగల చిరకాల కోరిక ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీడీ లుగా వర్గీకరించి చట్టబద్దత కల్పించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ పెంటనోళ్ళ నరసింహ అన్నారు. ఎమ్మార్పీ ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షలు 8 రోజుకు చేరాయి. ఫరూఖ్‌నగర్ మండల ఇన్చార్జి కల్లె పల్లిబాల్ రాజ్ మాదిగ ఆధ్వర్యంలో సోమవారం నిరా హారదీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా పెంటనోళ్ళ నరసింహ మాట్లాడుతూ దేశంలో అత్యధిక జనాభా కలిగి న మాదిగ, మాదిగ ఉపకులాలను పాలక పక్షాలు మో సం చేస్తూనే ఉన్నాయన్నారు. దేశ సంపదలో అందరికీ సమభావం కలిగి ఉండాలని అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరచారని అన్నారు. దేశంలో సకల అవకాశాల్లో సమాన హక్కు కలగాలని కోరుకున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేక ఎస్సీ రిజర్వేషన్లను ఒకే కులం సింహభాగం అనుభవించడం చట్టవిరుద్దమన్నారు. ఏబీసీడీ వర్గీకరణ ప్రస్తుతం జరిగే పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలని లేని పక్షాన దేశంలో రాజకీయ సంక్షోభం సృష్టిస్తామన్నారు. కార్య క్రమంలో బుర్ర రామచంద్రయ్య మాదిగ, బొబ్బిలి పాం డు మాదిగ, చెన్నగాళ్ల శ్రవణ్ కుమార్ మాదిగ, నల్ల కృష్ణ మాదిగ, జంగారి జంగయ్య మాదిగ, భిలా మాదిగ, శివ కుమార్ మాదిగ పాల్గొన్నారు.