Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల ప్రత్యేక అధికారి రఘుపతిరెడ్డి
నవతెలంగాణ-కేశంపేట
గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అధికారులకు మండల ప్రత్యేక అధికారి రఘుపతిరెడ్డి సూచించారు. సోమవారం మండల పరిధిలోని సంతపూర్ గ్రామంలో నర్సరీని, ప్రకృతి వనాన్ని పరిశీలించారు. అదేవిధంగా హరితహారంలో భాగంగా మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో త్వరగా పనులను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీఓ రవిచంద్ర కుమార్ రెడ్డి, ఎంపీఓ శ్రీనివాస్, ఏపీఓ అజీజ్, పంచాయతీ కార్యదర్శి హన్మంత్ రెడ్డి, సిబ్బంది రాంమ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.