Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్రమ నిర్మాణాలతో మెరుస్తున్న విద్యుత్ కాంతులు
- ఆధ్యాత్మిక కేంద్రాలు, చారిటీలు బడా బాబుల విల్లాలు
- పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-శంషాబాద్
హిమాయత్‌సాగర్ ఎఫ్టీఎల్ పరిసర ప్రాంతాలను రాత్రిపూట పరిశీలిస్తే అనేక అక్రమ నిర్మాణాలు దర్శనమిస్తా యి. రాత్రిపూట విద్యుత్ దీపాల కాంతులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దపడిన బంగళాలు మెరిసిపో తున్నా యి. హిమాయత్‌సాగర్ పరిధిలో పది కిలోమీటర్ల మేర అక్రమ నిర్మాణాలు చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ సాగర్‌లోనే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా యి. పాత జీఓ రద్దయినప్పటికీ కొత్త జీఓ వచ్చే వరకు అమలులో ఉంటుంది. ఈ విషయంలో అధికారులు ప్రజా ప్రతినిధులు బడా వ్యాపారవేత్తలు ఏ స్థాయిలో అవగాహన చేసుకుంటున్నారో స్పష్టమవుతుంది. 111 జిఓ అనంతరం హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌తో పాటు ప్రధా న వరద వాగులను కూడా అక్రమార్కులు మింగేస్తున్నా రు. భయంకర విధ్వంసం జరుగుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో అనేక అనుమానా లు అర్థమవుతున్నాయి.
హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వరదల నివా రణ కోసం అప్పటి నైజాం సర్కార్ దూర దృష్టి ఎంతో నైపుణ్యంతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలా శయాలను నిర్మించింది. దీంతో వరదల నివారణనే కాకుం డా హైదరాబాద్ నగరానికి స్వచ్ఛమైన తాగునీటినీ అందిం చిన ఘనత కూడా జంట జలాశయాలకు దక్కుతుంది. ఈ రెండు జలా శయాలు కలుషితం కాకుండా నాడు నిజాం గెజిట్‌తో పాటు స్వాతంత్ర అనంతరం ఏర్పడిన ప్రభుత్వాలు కూడా కాపాడుకుంటూ వచ్చాయి. జలాశయాలకు కింది భాగంలో ప్రభుత్వ రంగ సంస్థలు పరిశ్రమలు ఏర్పాటు చేసినప్పటికీ ఉపరితలం జోలికి వెళ్లలేదు. అయితే పెరు గుతున్న జనాభా అభివృద్ధి కారణంగా జంట జలాశయాల ఉపరితలంలో రసాయనిక పరిశ్రమలు కాలనీలు ఏర్పా టును గమనించిన అప్పటి ప్రభుత్వం 1996లో 111 జీఓ అమలులోకి తెచ్చిం ది. జంట జలాశయాల ఎఫ్టీఎల్ నుంచి చుట్టూ 10 కిలోమీటర్ల మేర ఏలాంటి పరిశ్రమలు, కాలనీలు గాని ఏర్పాటు చేయకుండా 111 జీవో జారీ చేశా రు. అంతర్జా తీయ విమానాశ్రయం, హైటెక్ సిటీ, అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం అనంతరం పరిస్థితులు క్రమంగా మారిపోతూ వచ్చాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానా శ్రయం, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో పెట్టుబడిదారులు, ప్రజా ప్రతినిధులు రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగారు.
ఇందులో భాగంగానే హిమాయత్‌సాగర్ బఫర్ జోన్ ఎఫ్టిఎల్ పరిధిలో మొదలుకొని 10 కిలోమీటర్లు పరిధిలో ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ నిబంధనలకు జీవోకు తూట్లు పొడుస్తూ అనేక అక్రమ నిర్మాణాలు జరిగిపోయాయి.
శంషాబాద్ మండల పరిధిలోని నర్కూడ రెవెన్యూ పరిధిలో హిమాయత్ సాగర్ విస్తరించి ఉంది. ఇక్కడ సాగ ర్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలకు అంతే లేకుండా పోతున్నది. ఆధ్యాత్మిక కేంద్రాలను నిర్మించుకొని వాటికి అడ్డాగా మిగతా నిర్మాణాలు చేపడుతున్నారు. మాజీ సర్పంచులు అక్రమ పర్మిషన్లు ఇస్తే వాళ్లపైన ఏ చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు స్వచ్ఛంద సంస్థ నిర్మించిన భవనం పక్కనే మరో భారీ ఎత్తున నిర్మాణం సాగుతున్నది. బ్యుటీ గ్రీ న్ ఏరియాతో పాటు, శంషాబాద్, కవ్వగుడా, కొత్వాల్‌గూడ తదితర గ్రామాల పరిధిలో పరిధి అతిక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. కొత్వాల్‌గూడ సాగర్ పరిధిలో పెద్ద ఎత్తున ఫంక్షన్ హాల్స్ కూడా నిర్మాణం జరుగుతున్నాయంటే ఆశ్చర్యం ఏ పాటి నిర్లక్ష్యమో తెలుస్తున్నది.
111 జీవో ఎత్తివేత అనంతరం పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి పంచాయతీ అధికారులు అక్ర మ నిర్మాణాల వైపు కన్నెత్తి చూడడం లేదు. కొత్త జీవో రానం త వరకు పాత జీవో అమల్లో ఉంటుందని ఇంగిత జ్ఞానం కూడా అధికారులు ప్రదర్శించడం లేదు. సాగర్‌లోకి జల ప్రవాహం వచ్చే దారులన్నిటిని అక్రమార్కులు ప్రీ కాస్ట్ నిర్మాణాలతో మూసేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రావాల్సిన వర్షపు నీరు రాకుండానే హిమాయత్ సాగర్ కుంచించుకుపోయిన కారణంగా వరద ముప్పును పసిగట్టి న అధికారులు గేట్లను తెరిచి బయటకి వదిలేస్తున్నారనీ స్థానికులు వాపోతున్నారు.
అభివృద్ధితో పాటు తాగునీరు ముఖ్యమే
ప్రజలకు అభివృద్ధితో పాటు తాగునీరు పర్యావరణ అంశాలు అత్యంత ముఖ్యమైన విషయాలు. వీటిని దష్టిలో పెట్టుకొని అప్పటి ప్రభుత్వాలు స్పష్టమైన జీవో జారీ చేసి అమలు చేశాయి. తీసిన మీడియా ద్వారా సమస్య గుర్తించిన అధికారులు వెంటనే చర్యలకు ఉపక్రమించేవా రు. పైరవీలకు లొంగగడం జరిగేది కాదు. కానీ తెలంగాణ స్వరాష్ట్రము ఏర్పాటు తర్వాత పరిస్థితులు పూర్తిగా మారి పోయాయి. చెరువులు కుంటలు కాపాడాలనే సోయి నుంచి అధికారులు దూరం జరిగారు. గతంలో కాపాడబడిన చెరువులు కుంటలు , వాగులు వంకలు, వరద కాలువలు నేడు కనబడకుండా పోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు సాగర్ పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకొని కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.