Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కాడిగల భాస్కర్
నవతెలంగాణ- రాజేంద్రనగర్
బీజేపీ చరిత్రను పూర్తిగా వ్యక్తీకరించి తెలంగాణ వి మోచన దినోత్సవాన్ని పూర్తిగా రాజకీయానికి వాడుకుం టోందని సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కాడిగల భాస్కర్ అన్నారు. సీపీఐ(ఎం)ఆధ్వర్యంలో చేస్తున్న బైక్ ర్యాలీ ఆదివారం అరంగల్ చౌరస్తాకు చేరుకుంది. సీపీఐ (ఎం) రాజేందర్ మండల కార్యదర్శి కురుమయ్య ఆధ్వ ర్యంలో అరంగల్ చౌరస్తాలో జరిగిన సభలో భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినం జరపడానికి బీజేపీకి ఎలాంటి అర్హత లేదన్నారు. విమోచన దినం జర పాలన్న చరిత్ర చెప్పాలన్న కమ్యూనిస్టులే ఉందన్నారు. బీజేపీ పూర్తిగా చరిత్రను వక్రీకరించి విమోచన దినో త్సవాన్ని పూర్తిగా హిందూ ముస్లిం గొడవగా తీర్చి దిద్ద డానికి ప్రయత్నం చేస్తోందన్నారు. బీజేపీ దుర్మార్గ పాల నకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నా రు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు సామిల్, జగదీష్, జిల్లా సభ్యులు శ్రీనివాసరెడ్డి, శ్యామ్, కాటేదాన్ క్లస్టర్ కన్వీనర్ రుద్ర కుమార్, ప్రజా నాట్యమండలి నాయకులు గణేష్, సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు జిఎం గట్టయ్య శ్రీకాంత్ మోహన్ రామ్ మోహని, జి చైతన్య ఉపాధ్యక్షులు బాలకష్ణ పాల్గొన్నారు.