Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కపాటి పాండురంగారెడ్డి
నవతెలంగాణ- కందుకూరు
దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ నా యకత్వం ఎంతో అవసరముందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కపాటి పాండు రంగారెడ్డి అన్నారు. కందుకూరు మండల కేంద్రంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ ఏ అన్నారు. సమస్యలు లేని సుస్థిర పరిపాలన అందించగల సత్తా కేవలం కేసీఆర్ కే ఉందన్నారు. స్వతంత్రం వచ్చినప్పటికీ దేశ ప్రజలు అర్ధ ఆకలితో అలమటిస్తున్నాన్నారు. ప్రజలకు కొనుగోలు శక్తి పెరిగినప్పుడే దేశ పరిపాలన విధానం బావున్నట్టు తెలిపారు. 75 ఏండ్ల పరిపా లనలో గత ప్రభుత్వాలు, ప్రస్తుతం కేం ద్రంలో ఉన్న టువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజల తలసర ఆదాయంలో చొరవ తీ సుకోకపోవడంతో ప్రజలు ఆశాజీవులు గా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిత్యవసర ధర లు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరు స్తున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు దేశంలో కావాల ని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ దేశంలో ప్రభావితంగ ల నాయకునిగా ఎదుగుతారని ఆశిస్తున్నామన్నారు.