Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చైర్మన్ మల్లికార్జున శర్మ నవతెలంగాణ-చందానగర్
తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ బైక్ ర్యాలీ శేరిలింగంపల్లి నియోజక వర్గానికి చేరుకున్న సందర్భంగా చందానగర్ గాంధీ విగ్రహం దగ్గర సీపీఐ(ఎం) ఆధ్వ ర్యంలో సభ నిర్వహించారు. ఈ సభలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు సామెల్, తారనగర్ తుల్జాభవాని ఆలయం చైర్మన్ మల్లికార్జున శర్మ మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం సాగిన వీరోచిత పోరాటం సాయుధ పోరాటమని అన్నారు.పోరాటంలో 4000 మం ది కమ్యూనిస్ట్లు ప్రాణ త్యాగం చేశారన్నారు. సాయుధ పోరాట స్ఫూర్తితో భవిషత్లో మరిన్ని ప్రజా పోరాటాలు నిర్వహించాలని పిలుపు నిచ్చారు. సీపీఐ(ఎం) శేరిలిం గంపల్లి జోన్ కార్యదర్శి, సి. శోభన్ అధ్యక్షన జరిగిన కార్య క్రమంలో నాయకులు, వి. మాణిక్యం కే, కృష్ణ, వరుణ్, జగ దీశ్, రాజు, శ్రీనివాసరెడ్డి, అభిషేక్ నందన్ పాల్గొన్నారు.