Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మహేశ్వరం
మండల పరిధిలో తుమ్మలూరు గ్రామంలో ఆర్ట్ ఫౌం డేషన్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. కార్య క్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా జడ్పీ చైర్ పర్సన్, ఆర్ట్ ఫౌం డేషన్ వ్యవస్థాపకురాలు తీగల అనితా హరినాథ్ రెడ్డితో పాటు ఫౌండేషన్ సీఈఓ తీగల త్రిషా రెడ్డి, తుమ్మలూరు గ్రామ సర్పంచ్ మద్ది సురేఖ కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. మెడికల్ క్యాంప్‌లో గ్రామం నుండి దాదాపు 400 మంది గ్రామస్తులు పాల్గొని బీపీ, షుగర్ టెస్టులు చేయించుకు న్నారు. గ్రామస్తులు ఇతర ఆరోగ్య సమస్యలను అక్కడికి వచ్చిన డాక్టర్లు, వైద్య సిబ్బందికి తెలిపి ఉచిత మందులను పొందారు. జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి మాట్లాడు తూ గ్రామం నుండి పట్టణానికి వెళ్లి ఇలాంటి వైద్య సేవలు చేయించుకోవాలంటే వేలల్లో ఖర్చు అవుతుందని ఆర్ట్ ఫౌం డేషన్ ద్వారా ఉచిత వైద్య సేవలతో పాటు ఉచిత మందు లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు రాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలను కోరారు. మహేశ్వరం నియోజక వర్గంలో ఇలా గ్రామ గ్రామాన ఉచిత వైద్య సేవలు అంది స్తున్నందుకు తుమ్మలూరు గ్రామస్తులు ఫౌండేషన్ సీఈఓ తీగల త్రిషా రెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ శ్రీహరి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.