Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
నవతెలంగాణ-మియాపూర్
పేద వర్గాల కోసం పనిచేసేది కమ్యూనిస్టులు మాత్ర మేనని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. ఆదివారం మియాపూర్ చౌరస్తాలో ఎంసిపిఐ(యు) మాజీ రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ తాండ్ర కుమార్ బడుగు బల హీన వర్గాల ఆశాజ్యోతి, ప్రజల పక్షాన నిలబడిన మహనీ యుడు అని, నమ్మిన సిద్ధాంతాల కోసం శ్రమించారు. ఆయన చూపిన బాటలో నడుస్తూ, ఆయన ఆశయాలను కొనసాగించాలని గాంధీ పేర్కొన్నారు. వారి అకాల మర ణం తీవ్ర దిగ్భాంతికరమైన విషయమని రాజకీయాల్లో తీరని లోటని, ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలు వెలకట్టలేమని గుర్తు చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. కార్యక్రమంలో తాండ్ర కుమార్ కు మారుడు రమేష్ కుటుంబ సభ్యులు చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పురు షోత్తం యాదవ్, గంగాధర్, కిరణ్ యాదవ్, కర్ణాకర్ గౌడ్, చంద్రిక ప్రసాద్ గౌడ్, గౌస్, అశోక్ గౌడ్, కాజా, రాజు గౌడ్, విజరు ముదిరాజు, నరేందర్ బల్లా పాల్గొన్నారు.