Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంసీపీఐ (యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి
నవతెలంగాణ-మియాపూర్
వీర తెలంగాణ రైతంగ సాయుధ పోరాటం వార్షికో త్సవ కార్యక్రమాలు సెప్టెంబర్ 11నుంచి 17 వరకూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ మియాపూర్ ప్రాంతంలోని స్టాలిన్ నగర్లో ప్రారంభమైనవి. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగాధగోని రవి మాట్లాడుతూ.. నాటి నిజాం పాల నపై కొనసాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరా ట స్ఫూర్తితో నేటి మతోన్మాద నియంతృత్వ పాలనపై ప్రజా సమీకరణ పోరాటాలు జరపాలన్నారు. నాటి వీర తెలం గాణ సంఘ పోరాట వారసత్వాన్ని పునికి పుచ్చుకుని తెలం గాణ ప్రజలు మతోత్మాద నియంతృత్వ పాలనతో కొనసా గుతున్న బీజేపీ, టీఆర్ఎస్ విధానాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17న వార్షికోత్సవ ముగింపు సభను హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని ఓంకార్ భవన్ బిఎన్ హాల్లో రాష్ట్రవ్యాపిత ప్రజా సమీకరణతో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజలు ప్రజాతంత్ర వాదులు మతోద్మాత నియంతృత్వ పాలన వ్యతిరేకించే ప్రతి పౌరులు హాజరై విజవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్ర మంలో కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వితుకారాం నాయక్, నాయకులు ఈ దశరత్ నాయక్, తుడుం అనిల్ కుమార్, పల్లె మురళి, యువజన సంఘం హైదరాబాద్ నాయకులు డి మధుసూ దన్, ఎండి సుల్తానా బేగం డి శ్రీనివాసులు, కర్ర దానయ్య రాములు, డి లక్ష్మి, ఎన్ గణేష్ ఎన్ నాగభూషణం, లక్ష్మీ నరసింహ శంకర్ అంజయ్య శివాని అమీనా బేగం, రాధా, మాధవ, శంకర్ చంద్రమోహన్ రెడ్డి దస్తప్ప రతన్ నాయక్ పాల్గొన్నారు.