Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు మృతి పలువురికి గాయాలు
- పట్టించుకోని అధికారులు
- భయాందోళనలో స్థానికులు
నవతెలంగాణ- కొత్తూరు
నాసిరకంగా నిర్మించిన కల్వర్టు కుంగి పోయి ప్రాణాంతకంగా మారింది. అక్కడ జరిగిన ప్రమా దంలో ఇద్దరు ప్రాణాలు వదిలి పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయినా ప్రభుత్వ అధికారుల్లో ఎ లాంటి చలనమూ లేదని స్థానిక ఎంపీటీసీ మండ ల సర్వసభ్య సమావేశంలో అధికారులను నిలదీశా రు. వివరాల్లోకి వెళితే.... మండలంలోని కోడిచెర్ల గ్రామం నుండి ఎస్బిపల్లికి వెళ్లే దారిలో వెంకటేశ్వర హ్యాచరీస్ సమీపంలో ఉన్నటువంటి కల్వర్టును కాం ట్రాక్టర్లు నాసిరకంగా నిర్మించడంతో కల్వర్టు కుం గిపోయి స్పీడ్ బ్రేకర్లాగా ప్రమాదకరంగా మారిం ది. రాత్రి వేళలో వచ్చే వాహనదారులకు దగ్గరకు వస్తేగానీ కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో తర చుగా అక్కడ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా యి. గతంలో ఎస్బిపల్లి గ్రామానికి చెందిన అంబటి యాదయ్య, నక్కల నరసింహ అక్కడ జరిగిన ప్రమా దంలో మృత్యువాత పడ్డారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు స్పందించి కల్వర్టు మరమ్మతులు చేపట్టి ప్రమాదాల బారి నుండి ప్రజలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
కోడిచెర్ల గ్రామ శివారులోని కల్వ ర్టును కాంట్రాక్టర్ నాసిరకంగా నిర్మిం చడంతో కుంగిపోయి స్పీడ్ బ్రేకర్ మాది రిగా ప్రమాదకరంగా మారింది. రోడ్డు లోపలికి కుంగిపోయి ఉండడం వల్ల దగ్గరకు వస్తే గాని కనపడని పరిస్థితి. దీంతో తరచుగా అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమా దంలో ఇప్పటికి ఇద్దరు మృతిచెందడం తోపాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నా అధికారుల్లో మాత్రం చలనం లేదు. ఇకనైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులను వెంటనే చేపట్టాలి.
- రవీందర్ రెడ్డి, ఎంపీటీసీ, కోడిచెర్ల
కోడిచెర్ల సమీ పంలో ఉన్నటు వంటి కల్వర్టు పూర్తి గా కుంగిపోవడం తో ప్రమాదాలకు అడ్డాగామారింది. అక్కడ జరిగిన ప్ర మాదంలో ఎస్బి పల్లి గ్రామానికి చెందిన అంబటి యాదయ్య, నక్కల నరసింహలు మృతి చెందారు. ఇంటి పెద్ద దిక్కున కోల్పోయిన వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తరచుగా ప్రమాదాలు జరుగుతున్న అధికారుల్లో మాత్రం ఎలాంటి చలనమూ లేకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
- అంబటి ప్రభాకర్, సర్పంచ్, ఎస్బిపల్లి