Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నందిగామ సీపీఐ మండల కార్యదర్శి కొంగరి నర్సింలుతో 9 మంది కార్యకర్తలు
- పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్సీ అలిగి బెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ-కొత్తూరు
తెలంగాణ సాయుధ పోరాటాన్ని బీజేపీ తప్పుగా చిత్రీ కరిస్తుందని, బీజేపీ ప్రచారాన్ని సీపీఐ(ఎం) తిప్పి కొడు తోందని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఈ సంద ర్భంగా షాద్నగర్లో జరిగిన కార్యక్రమంలో సీపీఐకి చెం దిన కొంతమంది నాయకులు సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సాయిబాబు ఆధ్వర్యంలో సీపీఐ(ఎం)లో చేరారు. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్వెస్లీ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో నందిగామ మండల కార్యదర్శి కొంగరి నర్సింలు, ఎర్రోళ్ల ప్రవీణ్, రమేష్, యాదయ్య, అజ్మత్, భీమయ్య, భిక్షపతి, కుమార్, నవీన్, తదితరులు ఉన్నారు.