Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
నవతెలంగాణ-షాద్నగర్
కష్టపడి చదివితే విద్యార్థులు ఉన్నతమైన స్థానాలకు చెరుకోవచ్చని, చిన్నతనం నుండి పరిశుభ్రమైన జీవన విధా నం అలవర్చుకోవాలని ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అ న్నారు. ఆదివారం షాద్నగర్ ప్రభుత్వ గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన స్వచ్ఛ గురుకుల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువు కుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. గురుకులా ల్లో చదువుతున్న విద్యార్థులు విద్యతోపాటు, ఆటల్లో సత్తా చాటుతున్నారని అన్నారు. గురుకులంలో విద్యార్థులకు ఇ బ్బంది కలగకుండా సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని సి బ్బందికి ఆదేశించారు. అనంతరం విద్యార్థులకు బహుమ తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈట గణేష్, టీఆర్ఎస్ నాయకులు ఎమ్మె సత్య నారాయణ, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.