Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
- ఎస్టీయూ 75వ వజ్రోత్సవాలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
317 ఉత్తర్వుల ద్వారా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని స్థానిక శాసన సభ్యులు మంచిరెడ్డి అన్నారు. స్థానిక వైష్ణవిగార్డెన్స్లో ఎస్టీయూ 75వసంతాల వజ్రోత్సవ వేడుకలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రుల తరువాత స్ధానం ఉపాధ్యాయులదేనని చెప్పారు. భావిభారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులకే ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో ఉన్నదని పేర్కొన్నారు. త్వరలో మన ఊరు-మన బడి ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. ఇప్పటికే ఆ పనులు వేగంగా సాగుతున్నాయని వివరించారు. రాష్ట్ర అధ్యక్షులు సదానందంగౌడ్ మాట్లాడుతూ.. 317 జీవో ద్వారా నెలకొన్న అసంబద్దాలను తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ని వెంటనే చేపట్టాలన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి పర్వత్ రెడ్డి మాట్లాడుతూ.. 75వసంతాల వజ్రోత్సవాలు జరుపుకుంటున్న ఏకైక సంఘం ఎస్టీయూ మాత్రమేనన్నారు. ఈ సందర్భంగా సంఘానికి విశేష సేవలందించిన విశ్రాంత ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర పూర్వ అధ్యక్షులు భుజంగరావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజమణి, పుట్టపాక ప్రవీణ్‌కుమార్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఏవి సుధాకర్, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరమణి, గోవర్ధన్ రెడ్డి, శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి శంకర్ మాతంగి, లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు పాండురంగారెడ్డి, రాజమల్లేష్, ఇబ్రహీంపట్నం, మంచాల యాచారం మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్ కుమార్, అలీం గఫార్, మల్గ మల్లేష్, బాలకృష్ణ, శ్రీనివాస్ నాయక్ తదితరులు హాజరయ్యారు.