Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్
నవతెలంగాణ-ఆమనగల్
చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ నులి పురుగుల నివారణకు కృషిచేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్ అన్నారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సంద ర్భంగా గురువారం ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆమన గల్ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థు లకు ఆల్బెండజోల్ మాత్రలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పాఠ శాలల్లో కళాశాలలో అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న ఒకటి నుంచి 19 ఏండ్లలోపు విద్యార్థులందరికీ ఈ మా త్రలు వేయాలని సూచించారు. ప్రజలు పరిశుభ్రత పారిశుధ్యంపై అవగాహన పెంచుకోవాలని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నులిపురుగులు సంక్రమిం చకుండా వాటి నివారణ కోసం ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత మాత్రలను ప్రతిఒక్క విద్యార్థి విధిగా వేసుకునేలా అధికారులు పర్యవేక్షించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంతకు ముందు ఆయ న కడ్తాల్ మండల కేంద్రంలో విద్యార్థులకు నులిపురుగుల మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యు లు నేనావత్ అనురాధ పత్య నాయక్, ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి, ఎంఈఓ సర్దార్ నాయక్, మున్సిపల్ చైర్మన్ నేనావత్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ భీమనపల్లి దుర్గయ్య, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు నిట్ట నారాయణ, కౌన్సిలర్ చెన్నకేశ వులు, కోఆప్షన్ సభ్యులు మేడిశెట్టి శ్రీధర్ పాల్గొన్నారు.