Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ వై రవిందర్ యాదవ్
నవతెలంగాణ-కేశంపేట
ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నదని ఎంపీపీ వై రవీందర్ యాదవ్ అన్నారు. ఆరోగ్యం పట్ల ప్రజలను చైతన్యం చే సేందుకు తెలంగాణ ప్రభుత్వం ముద్రించిన ఆయుష్ ఆరోగ్య కరదీపికను ఎంపీపీ గురువారం ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో అధునాతన పరికరాలను ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయి వైద్యం అందజేస్తుందన్నారు. ఇంట్లో ఉన్న వస్తువులతో స్వయంగా ప్రథమ చికిత్స ఎలా చేసుకో వాలో ఆయుష్ ఆరోగ్య కరదీపికలో రూపొందించబడ్డదని వివరించారు. అనంతరం తొమ్మిదిరేకుల గ్రామానికి చెంది న బి కిష్టరెడ్డికి రూ.20 వేలు, కేశంపేటకు చెందిన మల్తుం కార్ మహేబుబ్కు రూ.11వేలు, సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఫార్మసిస్ట్ హేమా రాణి, కేశంపేట, కొత్తపేట సర్పంచులు తలసాని వెంకట్ రెడ్డి, నవీన్‌కుమార్, మాజీ జెడ్పిటిసి పల్లె నర్సింగ్‌రావు, పిఏసీఎస్ వైస్ చైర్మన్ అంజిరెడ్డి, షాద్‌నగర్ మార్కెట్ కమి టీ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ గౌడ్, కోఆప్షన్ సభ్యు లు జమాల్ ఖాన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మురళీ ధర్ రెడ్డి, నాయకులు భూపాల్‌రెడ్డి, బాల్‌రాజ్ గౌడ్, రంగా రెడ్డి, జగన్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, మురళీమోహన్, శ్రీనివా సులు, బీరప్ప, వేణుగోపాలచారి, యాదగిరి పాల్గొన్నారు.