Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గజ్జల యోగానంద్
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపో వడం దారణమని బీజేపీ శేరిలింగంపల్లి ఇన్చార్జి గజ్జెల యోగానంద్ అన్నారు. మియపుర్ డివిజన్ లోని మియాపూర్ గ్రామం, న్యూ కాలనీ, మక్త ఎంఏనగర్ లోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలను, మియా పూర్ బీజేపీ అధ్యక్షులు మాణిక్రావు అధ్వర్యంలో యోగానంద్ సంద ర్శించారు. పాఠశాలలలోని సమస్యలను విద్యార్థులతో, ఉపాధ్యా యులతో పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ హెచ్ఎంటి కాలనీ మాక్తలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రహారికి అనుకొని డంపింగ్ యార్డ్ ఉండడం ద్వారా డంపింగ్ యార్డ్లో లోంచి వచ్చే దుర్వా సన విద్యార్థులు ఉపాధ్యాయులు భరించలేక వాంతులు చేసుకుంటున్నారనీ ఆరోపించారు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారని, ఉన్నత తరగతి గదులలో వసతు లు లేక విద్యా ర్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి ప్రతిపాఠ శాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేస్తా మని హెచ్చరించారు. ఆర్ నాగేశ్వర్ గౌడ్, విజేందర్ సింగ్, జితేందర్, రత్నకుమార్, వెంకట్, మన్యం, ప్రభాకర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.