Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి నియోజకవర్గం లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమో చన దినోత్సవం సందర్భంగా తెలంగాణా విమోచన అమృత మహౌ త్సవాల ప్రారంభోత్సవం కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిం చేందుకు బీజేవైఎం శేరిలింగంపల్లి అసెంబ్లీ అధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డితో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్ పాల్గొన్నారు. బొటానికల్ గార్డెన్ నుండి మియాపూర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం మియాపూర్ చౌరస్తా లో చాకలి ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. రంగారెడ్డి అర్బన్ జి ల్లా బీజేపీ అధ్యక్షులు సామ రంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణా విమోచన అమృత మహౌత్సవాలను కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం నుండి అధికారికంగా నిర్వహించడం శుభ పరిణామన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, సత్యనారాయణ, ప్రభాకర్ యాదవ్, బీజేపి సీనియర్ నాయకులు బుచ్చిరెడ్డి, బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి రఘునాథ్ యాదవ్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నాగేశ్వర్ గౌడ్, చందానగర్ మాజీ కార్పొరేటర్ బోబ్బా నవతా రెడ్డి, జిల్లా కార్యదర్శి మూల అనిల్‌గౌడ్, నాయకులు రవీందర్ రెడ్డి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కైతాపురం జితేందర్, బీజేపి డివిజన్ అధ్యక్షులు ఆంజనే యులు, రాజు శెట్టి, గొల్లపల్లి రాంరెడ్డి, శ్రీధర్ రావు, రాధాకృష్ణ యాదవ్, ఎల్లేష్ , జిల్లా ఓబిసి మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీశైలం కురుమ, యస్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి విజేందర్, జిల్లా కార్యదర్శి గంగల జంగయ్య యాదవ్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి కుమార్, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ అమర్ , నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.