Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- చేవెళ్ల
చేవెళ్లలోని శ్రీ బ్రహ్మగిరి క్షేత్రంలో నేడు శ్రీగాయత్రీ విశ్వకర్మ మహాయజ్ఞ మహౌత్సవాన్ని నిర్వహించను న్నారు. చేవెళ్ల మండల విశ్వకర్మ సంఘం, ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 17న ఉదయం 8.15 గంటలకు ధ్వజారోహణము, ఉదయం 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకూ గణపతి పూజ పుణ్యహ వచనము, పంచగవ్య పాలశన, అంకురారో హణము, నవగ్రహ దిక్పాలత పంచబ్రహ్మల పూజలు నిర్వహిస్తారు. అనంతరం శ్రీగాయత్రీ విశ్వకర్మ పూజ, అగ్ని ప్రతిష్ఠ, గాయత్రీ విశ్వకర్మ హౌమం, పూర్ణాహుతి, మహా నైవేథ్యం, మంగళహారతి, మంత్ర పుష్ఫము, తీర్థ ప్రసాద కార్యక్రమాలు ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ప్రముఖుల సందేశాలు, మధ్యాహ్నం 2 గంటల నుంచి భోజన విరామం తరువాత, సాయంత్రం 4 గంటల నుంచి విశ్మకర్మ భగవానుని ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైభవోపేతంగా నిర్వహించే గాయత్రీ విశ్వకర్మ మహాయజ్ఞమ హౌత్సవంలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని మండల విశ్వకర్మ సభ్యులు కోరారు.