Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే తెలంగాణ సాధ్యం
- వేడుకల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
నవతెలంగాణ-కొడంగల్
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మార్కెట్ యార్డు నుంచి దాదాపు 15 వేల మంది జాతీయ జెండాలు చేతబూని జూనియర్ కళాశాల వరకూ పెద్ద ఎత్తున ర్యాలీ కొనసాగించారు. ఈ ర్యాలీలు విద్యార్థులు, అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు, ర్యాలీలో భాగంగా నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడంతో అంబేద్కర్ విగ్రహానికి, సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు చాటుకున్నారు. జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మహాత్మ జ్యోతిబాపూలే, కస్తూరిబా గాంధీ, నవీన ఆదర్శ పాఠశాల, కృష్ణవేణి పాఠశాలల విద్యార్థులు నృత్యాలు చేసి, చూపురులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆనాటి హైదరాబాద్ సంస్థానం 1948 అక్టోబర్ 17న భారతదేశంలో ఐక్యమైందన్నారు. 2001 సంవత్సరం నుంచి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 14 ఏండ్లు పోరాటం చేసి, తెలం గాణ రాష్ట్ర సాధించుకున్నట్టు వివరించారు. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే తెలంగాణ సాధ్యమైందన్నారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో అందరికీ న్యాయం చేసే దిశగా కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి, జెడ్పిసీఈవో జానకిరామ్ రెడ్డి, డిప్యూటీ సీఈవో సుభాషిని, ఎంపీపీ పటేల్ విజరు కుమార్, జడ్పీటీసీిలు కోట్ల మహిపాల్, నాగరాణి, అరుణ్ దేశ్, మాజీ జడ్పీటీసీ మోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీ మహిపాల్ రెడ్డి, పీఎస్సీఎస్ చైర్మెన్లు కటకం శివకుమార్, విష్ణువర్ధన్ రెడ్డి, డీఎల్పీవో శంకర్ నాయక్, ఎంపీడీవోలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.