Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్
- సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా భారీ ర్యాలీ
నవతెలంగాణ-ఫరూఖ్‌నగర్
పోరాడి సాధించుకున్న రాష్ట్రం కేసీఆర్ ప్రభుత్వంలో బంగారు తెలంగాణ దిశగా ముందుకు పోతుందని షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను శుక్రవారం షాద్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలో ప్రారంభమయ్యాయి. ఈ వేడు కలకు షాద్‌నగర్ ఆర్డీఓ రాజేశ్వరి పర్యవేక్షణలో విద్యార్థులు వేలాదిగా తరలివచ్చి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిక్ జైన్ హాజరయ్యారు. ముందుగా పట్టణంలోని రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమైన భారీ ర్యాలీ మెయిన్ రోడ్ మీదుగా సాగింది. ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పట్టణ ముఖ్య కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి పూల మా లవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక ఇండోర్ స్టేడియానికి ర్యాలీ చేరుకుంది. సభను ఉద్దేశించి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రసంగిస్తూ ఆనాడు హైద రాబాద్ సంస్థానంలో ప్రజలు అణచివేతకు గురయ్యార న్నారు. నిజాంకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు జరిగాయ న్నారు. నిజాం నవాబు ఉస్మాన్ అలీఖాన్ విధి లేని పరిస్థి తుల్లో హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేశారని, ఆనాటి పోరాటంలో భాగంగా షాద్‌నగర్ నియోజకవర్గ కేంద్రం చౌరస్తాలో సర్దార్ వల్లభారు పటేల్ నేతృతంలోని సైనిక దళం బాంబుల వర్షం కురిపించిందని ఆయన గుర్తు చేశారు. వజ్రోత్సవాల్లో భాగంగా నియోజ కవర్గంలో వేల మందితో ర్యాలీ నిర్వహించి తెలంగాణ సమైక్యతను ఎలుగెత్తి చాటామన్నారు. భారత్ యూని యన్‌లో తెలంగాణ కలిసిన రోజైన సెప్టెంబర్ 17న జాతీ య జెండాను ఎగురవేయనున్నట్టు తెలిపారు. నీళ్లు, నిధు లు, నియామకాల లక్ష్యంతో వచ్చిన ప్రభుత్వం బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తోందన్నారు. అదనపు కలెక్ట ర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ ఇంతమంది విద్యార్థులను చూసి ఆనందంగా ఉందని ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమా నికి తరలిరావడం పట్ల నిర్వాహకులను కలెక్టర్ అభినందిం చారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, ఆర్డీ వో రాజేశ్వరి, ఏసీపీ కుషాల్కర్, జెడ్పిటిసిలు వెంకటరా మిరెడ్డి, విశాల, ఎంపీపీ ఇద్రిస్, మున్సిపల్ చైర్మన్ నరేంద ర్, వైస్ చైర్మన్ నటరాజన్, ఎంఈవో శంకర్ రాథోడ్ ఆయా మండలాల అధికారులు, ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.