Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా
కార్యదర్శి రుద్ర కుమార్
నవతెలంగాణ- రాజేంద్రనగర్
రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్య లు వెంటనే పరిష్కరించాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి రుద్ర కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్‌డబ్ల్యూఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజేంద్రనగర్ ఆర్టీసీ డిపో ఎదుట హైదరాబాద్ రీజియన్ కార్యదర్శి కృష్ణ ఆధ్వ ర్యంలో జరిగిన జెండావిష్కరణ కార్యక్రమంలో రుద్రకు మార్ ముఖ్య అతిథిగా పాల్గొన్న జెండాను ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1979 రోజున స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సీఐటీయూ అనుబంధ సంఘం ఆర్టీసీ కార్మికుల సమస్యల కోసం ఏర్పాటు చేసుకు న్నారు. ఇప్పటికీ 44 ఏండ్లు గడుస్తున్నాయి అనేక ప్రభు త్వాలు ఆర్టీసీ కార్మికుల పోరాటాలకు స్వీకరించి వారి సమ స్యలు పరిష్కరించాయన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం 2019 మోటార్ వెహికల్ వాహన చట్టం పార్లమెంటులో ప్రవేశపెట్టే ఆ చట్టాన్ని అమలు చేసుకుని దేశంలో ఉన్న రైల్వే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, రోడ్లు, ఓడరేవులు మొత్తం ప్రయివేటు శక్తులకు అప్ప చెబుతోం దని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2017 నుండి ఇప్ప టివరకు తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు రెండు పీఆర్సీలో ఇంప్లిమెంట్ చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. అదే మాదిరిగా ఆర్డిఏలు 2013న బాండ్ డబ్బులు ఇప్పటి వరకూ ఇవ్వలేదు. ఆర్టీసీ కార్మికులపై 8 గంటల పని ది నం, ఇంప్రూవ్మెంట్ చేయకుండా వారు డ్యూటీ సమయం లో వెళ్తున్న సందర్భంలో మార్గమధ్యలో ఏదైనా కారణం చేత ఆర్టీసీ బస్సు కరాబ్ అయినా లేక ట్రాఫిక్ జామ్ అయి న లేదా ఇతర ప్రాబ్లమ్స్ ఏమున్నా దాని షాపుగా చూపు తూ పని గంటల భారాన్ని పెంచుతూ దాదాపు 15,16 గంటల పనిని తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో, మన రాష్ట్రం నుండి విడిపోయి బడ్జెట్ తక్కువగా ఉన్న ఆర్టీసీ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తూ సంస్థను ప్రభుత్వ ఆధీ నంలో పెట్టారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పునర్ ఆలోచన చేస్తూ తెలంగాణలో ఉన్న ఆర్టీసీ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి. ఆర్టీసీని ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకుంటూ ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ సంస్థగా గుర్తింపు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. కార్యక్ర మంలో సీఐటీయూ నాయకులు భాస్కర్, శ్రీకాంత్ తది తరులు పాల్గొన్నారు.