Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
మండలంలోని శెట్టిపల్లి గ్రామంలో కోనసాగుతున్న ఆన్లైన్ పంటల నమోదు కార్యక్రమాన్ని శుక్రవారం మండల వ్యవసాయ అధికారి అరుణకుమారి పరిశీలించారు. ఈ సందర్భంగా సాగుచేసిన పత్తి, మొక్కజొన్న, వరి తదితర పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరిలో భాస్వరం కరిగించు జీవన ఎరువు (పి ఎస్ బి) వాడిన రైతు పొలాన్ని సందర్శించి తగిన సలహాలు సూచనలు తెలిపారు. పత్తి పంటలో రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువగా ఉన్నం దున ఆక్సలిన్ 160 గ్రామ్స్, ఫార్ములా 4,500 గ్రాములు పిచికారి చేయాలని రైతులకు సూచించారు. అదేవిధంగా గులాబీ రంగు పురుగు రాకుండా ముందస్తు జాగ్రత్తగా ఎకరాకు వేప నూనె5 మిల్లీలీటర్లు, క్లోరోపైరిఫాస్ ఫాల్స్ 2.5 మిల్లీ లీటర్లు కలిపి పిచికారి చేసుకోవాలని సూచిం చారు. కార్యక్రమంలో రైతులు శ్రీపతి కొండల్ రెడ్డి, తెలు గుమల లాలమ్మ, యాదమ్మ, లక్ష్మయ్య, వ్యవసాయ విస్తీర్ణ అధికారి సాయిరాం తదితరులు పాల్గొన్నారు.