Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
- ర్యాలీలో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీందర్
నవతెలంగాణ-రాజేంద్రనగర్
రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం ప్రస్తుతం అన్ని రం గాల్లో దూసుకుపోతుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రొఫెసర్ జయ శంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వ హించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజ రై, మాట్లాడుతూ రాచరిక వ్యవస్థ నుంచి తెలంగాణ సమా జం ప్రజస్వామిక వ్యవస్థలోకి వచ్చి 75 ఏండ్లు పూర్తవు తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహిస్తుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బడుగు బల హీన వర్గాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని వెల్లడించారు. పార్లమెంట్ భవనానికి అంబేదర్కర్ పేరు పెట్టాలని తెలం గాణ అసెంబ్లీలో తీర్మానించి, నూతన తెలంగాణ సచివా లయానికి అంబేద్కర్ పేరు పెట్టడం సంతోషకరమన్నా రు. రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ మాట్లాడుతూ రా ష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 3రోజులపాటు నిర్వహిస్తున్న సమైక్య జాతీయ వజ్రోత్సవాలకు, కుల, మత, జాతి విభేదా లు లేకుండా అందరూ జాతీయ సమైక్యవాదంతో ముందు కు నడవాలని పిలుపునిచ్చారు.రాజేంద్రనగర్ ఎన్ఐఆర్డీ నుంచి భారీ ర్యాలీగా ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు వచ్చారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీందర్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, సర్కిల్ జీహెచ్ఎంసీ కమిషనర్ జగన్,మేయర్, ఎంపీటీసీీ, కార్పొరేటర్లు, కౌన్సి లర్లు, సర్పంచులు పాల్గొన్నారు.