Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూస్వాముల గుండెల్లో దడపుట్టించిన భూ పోరాటం
- భీంరెడ్డి రాంరెడ్డి, కాసం కృష్ణముర్తి, పోచమోని జంగయ్యల నాయకత్వంలో ఉద్యమం ఉదృతం
- బాంచన్ దొర అన్నచేతులతో బంధుకులు పట్టించిన చరిత్ర
- దొరల గడీలను బద్దలు కొట్టిన ఎర్ర దళం
- భూస్వాముల గుండెల్లో దడపుట్టించిన భూ పోరాటం
- రాంచకొండ కేంద్రం రంగారెడ్డి జిల్లా ఉద్యమం
- లక్షల ఎకరాల భూ పంపిణీ
- భూ పోరాటంలో అమరులైన ఉద్యమ నాయకులు
- నాటీ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమే..
- నేటి ఉద్యమాలకు స్ఫూర్తి
భూమి కోసం.. భూక్తి కోసం..వెట్టిచాకరీ..బానిసత్వ విముక్తికై...బాంచన్ దొర నీ కాల్మొక్తానన్నా వారితో బంధుకులు పట్టించిన చరిత్ర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానిది. నిజాం నిరంకుశ పాలనలో దొరల, భూస్వాముల గడిల్లో బంధిగా మారిన బడుగు..బలహీన వర్గాల విముక్తికై దండుకట్టిన ఎర్రదండూ..జాగిర్దార్, జమీందార్, భూస్వాములు, పటేల్, పట్వారీలు.. దేశ్‌ముఖ్ దొరల..రజకారులను మట్టికరిపించి. '' దున్నే వాడిదే భూమి '' అనే నినాదాంతో..లక్షల ఎకరాల సర్కారు భూములను.. పేదల పంచిన చరిత్ర సాయుధ పోరాటానికి దక్కింది. ఈ పోరాటంలో భాగంగా వేలాది మంది మహానీయులు అమరులైయ్యారు..అ నాటి మహానియుల త్యాగం.. పోరాట పటిమ నేటితర ఉద్యమాలకు ఊతమిస్తున్నాయి.. నిజాం నిరంకుశపాలన నుంచి భూ స్వాముల అమానుష పీడన నుంచి విముక్తి కోసం.. భూమి కోసం.. భూక్తి కోసం గుండె నెత్తురులు తర్పణం చేసిన అమరుల త్యాగాలను స్మరిస్తూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సందర్భంగా నవతెలంగాణ ప్రత్యేక కథనం..
నవతెలంగాణ-రంగారెడ్డిప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నాయకత్వం కీలక భూమికి పోషించింది. దొరలు జమీందార్లు, పెత్తందార్లు, భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు నిజాం ప్రభువుకు తొత్తులుగా మరి ప్రజలను బానిసలుగా మార్చుకున్నారు. వారితో వెట్టి చాకిరీ చేయించుకునేవారు అడ్డువచ్చిన వారిని నానా రకాలుగా హింసించేవారు మహిళాల మాన, ప్రాణాలును దోచునేవారు. ఈ పరిస్థితితుల నుంచి ప్రజలకు మిముక్తి కలిగించేందుకు కమ్యూనిస్టులు నాయకత్వం చేపట్టిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో రాంచకొండ ప్రాంత కేంద్రంగా పుచ్చలపల్లి సుందరయ్య నాయకత్వ స్ఫూర్తితో బీంరెడ్డిరాంరెడ్డి, చండ్ర రాజేశ్వర్, కాసం కృష్ణ మూర్తిలు సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారు..అక్కడి నుంచే తమ దళానికి పెంచుకుంటూ.. రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో ఉద్యమాని విస్తరించారు. కౌలు రైతులు, కూలీల..సబ్బండ వర్గాలపై అనాటి భూస్వాములు, పెత్తందార్లు వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ.. వారి ఆగడాలను తిప్పికొట్టేందుకు విరోచిత పోరాటం చేశారు.
అలాంటి మహోత్తరమైన సాయుధ పోరాటాన్ని.. హిందూ, ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చిత్రికరించి మతోన్మాధ శక్తులు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని వక్రికరిస్తున్న పరిస్థితిని తిప్పికొట్టేందుకు సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ సెప్టెంబర్ 17 తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు నిర్వహించాలని పిలుపు నివ్వడంతో రంగారెడ్డి జిల్లా కమిటీ గత వారం రోజులగా జిల్లా వ్యాప్తంగా మోటర్ సైకిల్ యాత్రను నిర్వహించింది. ఈ యాత్ర సాయుధ పోరులో అహుతులైన మీరనారి చాకలి అయిలమ్మ 37 వర్ధంతి సందర్భంగా ఈ నెల 10న షాద్‌నగర్ ప్రాంతం నుంచి ప్రారంభమై...మోటర్ సైకిల్ యాత్ర జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ నిజాం ప్రభువుకు తొత్తులుగా ఉన్న భూస్వాములు చేతుల్లో బందిగా మారిన.. ప్రజల చేత బంధుకులు పట్టించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను ప్రజలకు అవగాహన పర్చుతూ.. రాజకీయ లబ్దికోసం కల్పిత చరిత్రను సృష్టిస్తున్న పార్టీల ఎత్తుగడను ఎండగడుతూ సాగిన సైకిల్ మోటర్ యాత్ర నేటితో ముగియనున్న సందర్భంగా రంగారెడ్డి జిల్లాలో సాయుధ రైతంగా పోరాటంలో... సాయుధలకు ఆశ్రయమించి ఆరుట్ల గ్రామంలో సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కమిటీ అధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో సాయుధ పోరాట చరిత్రను...నెమరువేసుకుందా...
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల వేలాది మంది ఉద్యమ నాయకులను, కౌలు రైతులు, పేద ప్రజలను నిజాం సైన్యం పొట్టన పెట్టుకుంది. భూ పోరాటంలో భాగంగా ఆరుట్ల గ్రామంలో కోమటి లింగయ్య, చెన్నరెడ్డిగూడెనాకి చెందిన హనుమంతు కౌలు రైతులను రజకారులు చిత్ర హింసలు పెట్టి చంపారు.. ఇలాంటి ఘటనలు జిల్లాలో ఎన్నో జరిగాయి. మంచాల మండలం నోముల గ్రామానికి చెందిన హనుమంతు.. జైల్లో పెట్టి.. కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వకుండ జైల్లోను మరణించే విధంగా కఠినమైన శిక్షలు విదుస్తు ప్రాణాలు పోయే వరకు జైల్లోనే బంధించారు. ఇలాంటి ఎందరో మహానీయులు సాయుధ పోరాటంలో అమరులైయ్యారు. అమరుల త్యాగం..వారి పటిమ...నిజాం పాలన అంతమోందించి.. వెట్టి చాకిరీ విముక్తికి నాంది పలికింది.. అనాటి సాయుధ పోరాటం.. అ నాటి నాయకుల ఉద్యమ స్ఫూర్తి నేటి ఉద్యమాలకు ఊత మిస్తున్నాయి.
శివన్న గూడెం కేంద్రంగా ఉన్న రజకారుల క్యాంపుల్లో కౌలు రైతులును బంధించి చిత్ర హింసలకు గురిచేస్తున్న సందర్భంలో.. కమ్యూనిస్టు దళాలు రజకారుల క్యాంపుపై మెరుపు దాడులు చేసి రజకారుల వద్ద బంధిగా ఉన్న కౌలు రైతులు సోమయ్య, మల్లయ్యలను రక్షించారు.. కానీ భూస్వాములకు ఎదురు తిరిగిన కౌలు రైతులను రజకారులు సజీవ ఖననం చేశారు.. బొడగుట్ట ప్రాంతంలో కౌలు రైతులను తమతోనే బొంద తీయించి.. అదే గోతిలో సజీవంగా పాతిపెట్టిన ఘటనలు చేటుచేసుకున్నాయి.
ఈ ఘటనతో జిల్లాలో ఉద్యమం ఉదృంతంగా సాగింది.. ఇబ్రహింపట్నం.. మంచాల, యాచారం, మాడ్గుల, దారుర్, ప్రాంతాల్లో యువత ఉద్యమంలో పాల్గొని ఆయా ప్రాంతాల్లో భూస్వాములకు ముచ్చేమటలు పట్టించారు. బర్ల శివయ్య, పోచబోయిన జంగయ్య, అడివయ్య, కుకడాల జంగరెడ్డి, పోచాయ్య, అరుట్ల గ్రామానికి చెందిన దానయ్యలు సాయుధ పోరాటంలో కీల భూమిక పోషిస్తూ ఈ ప్రాంత ప్రజల్లో చైతన్యాన్ని నింపారు. శివన్న గూడెం రజకారుల క్యాంప్‌పై దాడిసి భూస్వాముల భూములను పేదలకు పంపిణీ చేసిన కార్యక్రమంలో ఈ ప్రాంతలో వేలాది ఎకరాలు పంపిణీ చేయడం జరిగింది. లోయపల్లి, అందోడ తాండ, ఎల్లమ్మ తాండలో దున్నే వాడిదే భూమి అన్న నినాదంతో భూస్వాములు భూముల్లో ఎర్రజెండాలు పాతి వేల ఎకరాలు నిరుపేద దళిత, గిరిజన ప్రజలు పంపిణీ చేయడం జరిగింది.
గెరిల్లా పోరాటం ..
లెవీ ధాన్యాన్ని వసూలు చేయకుండా అడ్డుకోవడం, పటేల్, పట్వార్ల వద్ద గల రికార్డులను లాక్కోవడం, పన్ను వసూలు నిరాకరించడం, పన్నులు చెల్లించకుండా ఉండటం పెద్ద ఎత్తున సాగింది. ఒక వెళ్ళువలా ప్రజలు కదిలారా, దీంతో ప్రభుత్వం గడగడలాడిపోయింది. ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమాన్ని అణిచి వేయాలని పోలీసులు, రజాకారులను ఊర్ల మీదకు పంపింది. ఈ ముష్కరులు ఊర్ల మీద పడి దాడులకు ఉపక్రమించారు. ప్రభుత్వం సాయుధ దాడికి దిగేసరికి దానిని ప్రతిఘటించేందుకు తప్పని పరిస్థితుల్లో సాయుధ పోరును చేపట్టాల్సిన అవసరం వచ్చింది. ఈ నేపథ్యంలో 1947లో ఆయుధాల సేకరణకు పార్టీ పిలుపునిచ్చింది. జాగీరుదార్లు, దేశ్‌ముఖ్‌ల గడీల మీద పడి ఆయుధాలు లాక్కోవడం సాయుధ గెరిల్లా పోరాటం ప్రారంభమైంది. మిలటరీ యాక్షన్ పూర్వం, గ్రామరాజ్యాలు వాటి పరిరక్షణకు గ్రామ దళాలు ఏర్పడ్డాయి. భూ పంపిణీ విస్తారంగా జరుగుతున్న కాలంలోనే ప్రతిఘటన శక్తి అనేక రెట్లు పెరిగింది. నిజాం రజాకారుల క్యాంపులను తుడిచిపెట్టే ట్రెండ్ బయలుదేరింది. దళం వేసే ప్రతి అడుగు జనం అండదండలు మెండుగా ఉన్నాయి. క్యాంపులనే లక్ష్యం చేసుకొని దాడులు మొదలయ్యాయి. మోత్కూరు, మొండ్రాయి, గుండ్రాంపల్లి, బైరాన్‌పల్లి రాజాకారుల, పోలీసుల క్యాంపులపై దళాలు చుట్టుముట్టి దాడి చేసి ఆయుధాలను సేకరించాయి. ఆయుధాలను జాగ్రత్త పరిచే విషయంతో పాటు ఆయుధాలను ఒక దగ్గర డంప్ చేసి ఆత్మరక్షణ కోసం కావల్సిన ఆయుధాలను దగ్గర ఉంచుకొని వ్యక్తులుగా తమను తాము ఎలా కాపాడుకోవాలో దళ సభ్యులకు వివరించేవారు. దళాలన్నింటిని షర్భీ పక్కన బాగాయత్ (బాగాయత్ అంటే నైజాం స్వంత జాగీర్ ప్రాంతం, ఇప్పటి రంగారెడ్డి జిల్లా) ప్రాంతానికి రావాలని అక్కడ రక్షణ తీసుకోవాలని చెప్పారు. హైదరాబాద్ చుట్టూ ఉంటుంది. కృష్ణమూర్తికి ఈ ప్రాంతంలో ఉండి కార్యకలాపాలు సాగించాలని రాచకొండ గుట్టల్లో రక్షణ తీసుకోవాలని సుందరయ్య చెప్పారు. ఆయన సూచన మేరకు కృష్ణమూర్తి రంగారెడ్డి జిల్లా రాచకొండ ప్రాంతానికి వెళ్ళి అక్కడ దళాలను సిద్ధం చేసి గ్రామాల్లోకి వెళ్ళి ప్రదర్శనలు చేస్తూ ఆ ప్రాంతంలో ప్రజలు కమ్యూనిస్టులంటే భయపడేవారు అలాంటి ప్రజలదగ్గరకు వెళ్ళి సంఘం అంటే ఏమిటి కమ్యూనిస్టు పార్టీ ఏం చెబుతుంది. ఎవరి కోసం పోరాడుతుంది, మిలటరీ దాడుల నుండి రక్షణ తీసుకోవడం కోసం వచ్చాము, మాకు వ్యతిరేకంగాపెత్తందారులు చెప్పింది వినకండి అని ప్రజలందరిని ఒప్పించేందుకు కృషి చేశారు. గ్రామాల్లో ఒక నిర్మాణ యంత్రాంగాన్ని సృష్టించారు.
రాచరిక పాలనను మట్టుపెట్టింది కమ్యూనిస్టులే
ఫ్యూడల్ వ్యవస్థ నుంచి ప్రజలను విముక్తి పరిచిన చరిత్ర ముమ్మాటికి కమ్యూనిస్టులదే.. ఎవరు ఎన్నీ కల్పిత కథలు రాసుకున్న ప్రజలు నమ్మరు. ఆ నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేటి ఉద్యమాలకు స్ఫూర్తి.. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో కొనసాగుతున్న నిర్భంద పాలనకు వ్యతిరేకంగా భవిష్యత్‌లో ఉద్యమాలు చేపట్టి ప్రజలకు విముక్తి కల్పించడమే.. నిజాం సర్కార్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ.. అమరత్వం పొందిన నాయకులకు అర్పించే నిజమైన నివాళ్లు.
-కాడిగళ్ల భాస్కర్ , సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి
భూ పంపిణీ చరిత్ర కమ్యూనిస్టులది
తెలంగాణ సాయుధ రైతంగా పోరాట ఫలితంగా ఎంతో మంది నిరుపేద దళిత, గిరిజనులకు భూ పంపిణీ చేయడం జరిగింది. దున్నే వాడిదే భూమి అన్న నినాదం.. భూస్వాములు గుండెల్లో రైలు పరిగె ట్టించింది.. భూ పోరాట స్ఫూర్తిలో అనాటి కాంగ్రెస్ నాయకత్వం..కమ్యూనిస్టులకు పోటిగా జిల్లాలో భూ పంపిణీ చేసేందుకు ఉద్యమం ఊతమించింది. వెట్టి చాకిరీ.. బానిసత్వం విముక్తికై సాయుధ పోరాటం కీలక భూమిక పోషించింది.
-పగడాల యాదయ్య సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు