Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- మీర్ పేట్ నుంచి బడంగ్ పేట్ వరకూ విద్యార్థులతో భారీ ర్యాలీ
నవతెలంగాణ-మీర్పేట్
తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ విమోచన రోజంటూ వక్రీకరిస్తుందని విద్యాశాఖ మంత్రి అ న్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకూ తెలం గాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ సంబురాల సందర్భం గా శుక్రవారం మీర్పేట్ చౌరస్తా నుండి బడంగ్పేట్ వరకూ భారీర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రారంభించి దాదాపు మూడున్నర కిలోమీటర్ల వరకూ పాదయాత్రగా ర్యాలీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. అనం తరం ఆమె మాట్లాడుతూ కుల మతాలకతీతంగా నైజాం నిరంకుశ పాలనకు వెట్టిచాకిరికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం వల్లనే రాచరికం నుండి ప్రజాస్వామ్యంలోకి వచ్చి న రోజు సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణకు స్వాతంత్రం వచ్చిందని తెలిపారు. అంబేద్కర్ ఆలోచన విధానం, అంబే ద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్ప డిందని గుర్తు చేశారు. ప్రజల త్యాగాలను పోరాటాలను మరిచి నేడు బీజేపీ నాయకులు విమోచన దినమంటూ అది హిందూ ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం లో చిత్రీకరిస్తూ సభలు ఏర్పాటు చేసి చెప్పడం హాస్యస్ప దమన్నారు. కార్యక్రమంలో మీర్పేట్ మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, మీర్ పేట్ కమిషనర్లు నాగేశ్వర్, కృష్ణమోహన్ రెడ్డి, ఎమ్మార్వో జనార్దన్రావు, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు, వివిధ పాఠశాలల విద్యార్థులు పెద్దఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు.