Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మర్పల్లి
మండల కేంద్రంలో ఇంటర్సిటీ ఎక్స్ ప్రెస్ ట్రైన్ నిలుపుట కోసం మండలం నుండి అధిక సంఖ్యలో ట్రైన్ పాసులు తీయాలని గ్రామపెద్దలు అవగాహన కల్పిస్తున్నా రు. రోజు ఉదయం బీదర్ నుండి మర్పల్లి మీదుగా హైదరాబాద్ హైదరాబాద్ నుండి సాయంత్రం బీదర్ రాక పోకలు కొనసాగిస్తున్న ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును మర్పల్లి మండల కేంద్రంలో నిలపాలని కొనేండ్లుగా గ్రామస్తులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే రైల్వే అధికారులకు నమ్మకంకలిగేందుకు మండలం నుండి హైదరాబాద్, బీదర్ రెగ్యులర్‌గా వెళ్లేందుకు సుమారు 5 వందల వరకు ట్రైన్ పాసులు తీసేందుకు ఇంటర్సిటీ సాధన సమితి, గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు కిరాణాషాప్, వ్యాపారస్తులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు, ట్రైన్ పాసులు తీయాలని వారం రోజు లుగా అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి గ్రామపంచాయతీ నుండి కొన్ని పాసులు తీయాలని ఒప్పందాలు చేస్తున్నారు. ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు మర్పల్లి మండల కేంద్రంలో ఆగితే మండలంతో పాటు చుట్టుపక్కల మండలాల నిరుద్యో గులకు, ఉద్యోగులకు, వ్యాపారస్తులకు, ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అందుకే రైల్ పాస్‌ల కోసం కృషి చేస్తున్నామని వారు తెలిపారు. కార్యక్రమంలో సాధన సమితి అధ్యక్షుడు కోమారి వెంకటేశం, ఉపాధ్య క్షుడు నర్సింలు, కార్యదర్శి అఫ్రోజ్, గ్రామ పెద్దలు జిల్లా మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షుడు ఖలీమొద్దీన్, దుగ్గని రంగ య్య, మాజీ సర్పంచ్ మనోహర్, మాజీ ఎంపిటిసి శేఖర్ యాదవ్, జీ నర్సింలు యాదవ్, గణేష్, నీలి శ్రీకాంత్, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గఫార్, తాజుద్దీన్, బాబు శేఖర్ పాల్గొన్నారు.