Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
ఆమనగల్ పట్టణంలో శుక్రవారం అంబేద్కర్ జాతర కోఆర్డినేటర్ జి సుధాకర్ కమిటీ అధ్యక్షులు కేశమల్ల భిక్షపతి ఆధ్వర్యంలో అంబేద్కర్ పూలే జ్ఞాన ప్రచార రథయాత్రను ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జెడ్పీటీసీ సభ్యులు నేనావత్ అను రాధ పత్య నాయక్, ప్రముఖ సంఘ సేవకులు పాపి శెట్టి రాము, ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘ వేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్, తెలం గాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్ము తిరుపతి, అంబేద్కర్ పూలే జ్ఞాన జాతర అధ్యక్షులు కనుగుల జంగయ్య, డప్పు మహేష్, బహుజన సంఘాల నాయకులు డాక్టర్ వర్కాల శేఖర్, మాజీ ఎంపీపీ రఘు రాములు తదితరులు హాజరై మాట్లాడారు. అనంతరం జెండా ఊపి జ్ఞాన జాతర రథాన్ని ప్రారంభించారు. స్థానిక గాంధీ చౌక్ వద్ద శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదా రిపై నిర్వహించిన ఈకార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దయ్య యాదవ్, భీమయ్య, తాండ్ర రాములు, గోరటి యాదయ్య, కట్ట రాములు, నవీన్ కుమార్ గౌడ్, కొప్పు పుల్లయ్య, కళాకారులు జగన్, సీత పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు.