Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరికె పూడి గాంధీ
నవతెలంగాణ-చందానగర్
2022 సెప్టెంబర్ 17ను తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ ప్రారంభ దినం గా, 3 రోజుల పాటు నిర్వహించబోయే కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ ఆధ్వర్యంలో మియాపూర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి స్టేడియం వరకూ 15,000ల మందితో కూడిన విద్యార్థులు, యువతీ, యువకులు, మహిళలతో, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాద యాత్రగా భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని మాట్లాడుతూ 1948 సెప్టెం బర్17న తెలంగాణలో రాచరిక పాలన నుండి ప్రజాస్వా మ్య పరిపాలనా దశకు పరివర్తన చెందిన రోజు అని అన్నా రు. జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను 3 రోజులపాటు ఘనంగా నిర్వహించుకుందామని జాతి నిర్మాతల త్యాగా లను స్మరించుకుందామని గాంధీ పేర్కొన్నారు. నోడల్ అధికారి, వంశీ మోహన్ డిప్యూటీ కలెక్టర్, తహశీల్దార్, శేరిలిం గంపల్లి, జోనల్ కమిషనర్ శంకరయ్య, మాదాపూ ర్ డీసీపీ శిల్ప వల్లి, మియాపూర్ ఏసీపీ కృష్ణ ప్రసాద్, మాదాపూర్ ఏసీపీ రఘునందన్, శేరిలింగంపల్లి డీసీ వెం కన్న, చందానగర్ డీసీ సుధాంష్, కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు, పూజిత జగదీశ్వర్ గౌడ్, మంజుల రఘునాథ్ రెడ్డి, రోజాదేవి రంగరావు, సింధు ఆదర్శ్ రెడ్డి , మాజీ కార్పొరేటర్ సాయి బాబా, రెవె న్యూశాఖ, అధికారులు, ఇతర శాఖల అధికారులు పోలీస్ సిబ్బంది, తిరుపతి రావు, క్యాస్ట్రో రెడ్డి, క్రైమ్ కాంత రెడ్డి, ప్రాజెక్ట్ ఆఫీసర్లు మన్వి, ఉష రాణి, మండల విద్యాధికారి వెంకటయ్య, మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, ఆయా డివిజన్ల అధ్యక్షులు విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు, సంఘాల ప్రతినిధులు, సంఖ్యలో పాల్గొన్నారు.