Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో నిరుపేద కుటుంబాల కోసం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం తలకొండపల్లి మండలంలోని ఇస్రాయిపల్లి గ్రామంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాల కోసం 27 ఇండ్లు నిర్మిస్తుండగా శుక్రవారం ఆర్.కుమార్, బి.వెంకటయ్య ఇండ్ల నిర్మాణాలకు కావలసిన ఇటుక, ఇసుక సిమెంట్ తదితర వాటిని ఉప్పల ట్రస్ట్ సభ్యులు సమకూర్చారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు మల్కేడి అంబాజీ, ఉపసర్పంచ్ ఎంఏ.అజీజ్, మాజీ పీఏసీఎస్ డైరెక్టర్ కృష్ణయ్య గౌడ్ పాల్గొన్నారు.
మృతుని కుటుంబానికి ఆర్థికసాయం
తలకొండపల్లి మండలంలోని లింగరావుపల్లి గ్రామానికి చెందిన బి.రోశయ్య అనారోగ్యంతో బాధపడుతు శుక్రవారం మృతిచెందాడు. విషయం తెలుసుకున్న తల కొండపల్లి మండల జెడ్పీటీసీ సభ్యులు ఉప్పల వెంకటేష్ బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపి తన ట్రస్ట్ ద్వారా మృతుని కుటుంబానికి రూ.3 వేలు ఆర్థికసాయం అందజేశారు. అదేవిధంగా పీఏసీఎస్ చైర్మెన్ గట్ల కేశవరెడ్డి రూ.2 వేలు, స్థానిక సర్పంచ్ ఎల్లమ్మ తిరుపతయ్య రూ.2 వేలు మతుని కుటుంబానికి అంద జేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు, స్థానిక ఎంపీటీసీ సభ్యులు జోగు రమేష్, కోఆప్షన్ సభ్యుడు ఇమ్రాన్, ఉపసర్పంచ్ మణికంఠ, నాయకులు యాదయ్య, వెంకటయ్య, రాములు, లోకేష్ పాల్గొన్నారు.