Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
- నేడు జరిగే జాతీయ పతాకావిష్కరణను విజయవంతం చేయండి
జిల్లా కలెక్టర్ కె. నిఖిల
నవతెలంగాణ- వికారాబాద్ కలెక్టరేట్
సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానానికి నిజమైన స్వతంత్రం లభించిందని, దీనితో రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పాలనలోకి అడుగుపెట్టి 75 వసం తాలను పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యత వాజ్రోత్సవాలను నిర్వహిం చుకుం టామని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తెలిపా రు. ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, జిల్లా కలెక్టర్ నిఖిలతో కలసి కలెక్టర్ కార్యాలయం నుండి భారీ ర్యాలీని ప్రా రంభించారు. ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, అధికా రులు వారి సిబ్బందితో నిర్వహించిన ర్యాలీ కలెక్టర్ కార్యలయం నుండి స్థానిక సంగెం లక్ష్మి బాయి పాఠశా ల వరకూ జాతీయ జెండాలతో తెలంగాణ నినా దాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. సెప్టెంబర్,17న పోలీ స్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఉపసభాపతి పద్మారావు జాతీయ పతకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్, జడ్పీ వైస్ చైర్మన్ విజ యకుమార్, ఎంపీపీ చంద్రకళ, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రామ్ రెడ్డి, వికారాబాద్ పట్టణ కౌన్సిలర్లు, స్థాని క ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, ప్రభుత్వ ఉద్యో గులు తదితరులు పాల్గొన్నారు.