Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ సహకారంతో తాండూర్కి నర్సింగ్ కాలేజ్
- నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
- తాండూరు అభివృద్ధిని అడ్డుకోవడం ఎవరితరం కాదు
- 'మీ పక్షాన నేనున్నాను-మీ కోసం నేను ఉంటాను': ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
నవతెలంగాణ-తాండూరు
ఎన్నో త్యాగాల పోరాట ఫలితమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. తాండూరు నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ర్యాలీలో స్థానిక శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లా డుతూ.. తెలంగాణ స్ఫూర్తిని ప్రజలందరికీ తెలి సేలా వజ్రోత్సవాలు నిర్వహించాలని కోరారు.1947 ఆగస్టు 15న భారతదేశినికి స్వాతంత్రం వచ్చిందని, 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానాన్ని స్వాతంత్ర భారత దేశంలో విలీనం చేయడం జరిగిం దన్నారు. తెలంగాణలో రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పరిపాలన దశకు పరివర్తన చెందిన రోజు సెప్టెంబర్ 17 అని గుర్తు చేశారు.అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాం గంలోని ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను సీఎం కేసీఆర్ దీర్ఘకాలం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ముందుండి నడిపి 2014లో కోట్లాది తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షలు , కలలని నిజం చేశారని వెల్లడించారు. సాధించుకున్న స్వరాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని విద్య, వైద్యం వ్యవసాయ రంగాల్లో, సాగునీటి రంగాలలో దేశా నికి దిక్సూచిగా నిలపారన్నారు. దేశానికి స్వాతం త్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సంద ర్భంగా సీఎం కేసీఆర్ ఆగస్టు 15 న స్వాతంత్ర భారత వత్సోత్సవ వేడుకలు నిర్వహించారని, అలాగే సెప్టెంబర్ 17ను దృష్టిలో పెట్టుకుని, 17న హైదరా బాదులోని పబ్లిక్ గార్డెన్స్‌లో సీఎం కేసీఆర్‌తో జాతీయ పతాక ఆవిష్కరణ ఉంటుందన్నారు. అదే రోజు అన్ని జిల్లా కేంద్రాలలో గౌరవ రాష్ట్ర మంత్రి వర్యులు ప్రముఖులు జాతీయ జెండా ఆవిష్క రిస్తారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పట్టణ, స్థానిక సంస్థలు గ్రామపంచాయతీల కార్యాల యాలపై జాతీయ పతావిష్కరణ కార్యక్రమం ఉంటుందన్నారు. హైదరాబాదులో నిర్మించిన కొమరం భీం ఆదివాసి ఆత్మగౌరవ భవనం, సేవాలాల్ బంజారా ఆత్మగౌరవ భవనాలు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నట్టు తెలిపారు. నెక్లెస్ రోడ్ లోని అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకూ ఆదివాసి గిరిజన కళారూపాలతో భారీ ఊరే గింపు బహిరంగ సభ ఉంటుందని వెల్లడిం చారు. 18 న జిల్లా కేంద్రంలో స్వాతంత్య్ర సమర యోధులకు, కవులకు, కళాకారులకు సన్మానాలు చేయాలని జాతీయ సమైక్యతను, సమగ్రతను చాటేలా సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. జాతీయ సమైక్య ఉత్సవాలుగా నిర్వహిం చాలని ఆదేశించడం జరిగిందన్నారు.దానిలో భాగంగానే తాండూర్ పట్టణంలో జాతీయ సమైక్యత ర్యాలీని విద్యార్థులు, యువకులు కార్మికులు, పట్టణ ప్రజల ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి విలియం మూన్ చౌరస్తా వరకూ ర్యాలీ నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తాండూర్ అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మెన్ ఎస్ రాజుగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్, మున్సిపల్ వైస్ చైర్మెన్ దీప, మార్కెట్ కమిటీ చైర్మెన్ విట్టల్ నాయక్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ వెంకటరెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ మహిళా నాయకురాలు శకుంతల, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు నయీం అప్పు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, పంజుగుల నర్సిరెడ్డి, శ్రీనివాస్ చారి, రవీందర్ రెడ్డి, కౌన్సిలర్లు, దేవాలయ కమిటి చైర్మన్లు, టీఆర్ఎస్ పార్టీ యూత్ విభాగం నాయకులు సోషల్ మీడియా కన్వీనర్ ఇంతియాజ్ పాల్గొన్నారు.