Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చేవెళ్ల
పేద విద్యార్థుల చదువులకు దాతల సహకారం ఎంతో అవసరమని ఉపాధ్యా యులు, పర్యావరణ అవార్డు గ్రహీత రామ కృష్ణారావు అన్నారు. శుక్రవారం చేవెళ్లలోని కస్తూర్భా పాఠశాలకు చేవెళ్ల వాస్తవ్యులు జూకన్నగారి జైపాల్ రెడ్డి, పావని దంపతులు వారి కుమారుడు గీత్ శ్రీనందన్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా రూ.50వేల విలువైన గ్రైండర్, మిక్సీ, ఇడ్లీ కుక్కర్, 25 , 12 కేజీల గిన్నెలు, నీళ్ల డ్రమ్ములు, పెద్దవి స్టవ్లు, ఇతర వంట సామగ్రిని పాఠశాల స్పెషల్ ఆఫీసర్ శ్వేతా రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణారావు మాట్లాడుతూ చాలా రోజుల నుంచి వంట సామగ్రి సరి పోయేంత లేకపోయినందున జైపాల్ రెడ్డి, పావని దంపతులు స్పందించి పాఠశాలకు విలువైన మెటీరియల్ అందించడడంతో అభినందించారు. దీంతో కస్తూర్భా పాఠ శాల సమస్య పరిష్కారమైనట్టు పేర్కొన్నారు. దాతల సహకారాన్ని అంది పుచ్చుకొని విద్యార్థులు కష్టపడి చదవాలని సూచించారు. చేవెళ్ల ప్రాంతంలో విద్యాభి వృద్ధికి ఎంతో మంది దాతలు ముందుకు వస్తుండటం అభినందించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కస్తూర్భా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.