Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరుపేదల మన్ననలు పొందుతున్న సీఎం కేసీఆర్
- చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
నవతెలంగాణ-చేవెళ్ల
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. తెలంగాణ జాతీయ సమైఖ్యత వజ్రోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం చేవెళ్లలో జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహిం చారు. నియోజకవర్గ పరిధిలోని చేవెళ్ల, షాబాద్, శంకర్పల్లి, మొయినాబాద్, నవాబ్‌పేట మండ లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, మహిళా సమైక్య సభ్యులు, ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి శివారులో ఉన్న ఫరా కళాశాల మైదానం వరకూ ర్యాలీ కొనసాగింది. వజ్రోత్సవ సభలో ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ నిజం పాలన నుంచి విముక్తి కోసం ఎంతో మంది పోరాటాలు చేశారని, చాకలి ఐలమ్మ,దొడ్డి కొమురయ్య లాంటి వారు ఎంతో మంది అమరులయ్యారన్నారు. సర్దార్ వల్లభారు పటేల్ కృషితో తెలంగాణ సంస్థానం భారతదేశంలో విలీయమైందన్నారు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే తెలంగాణ సమాజానికి మాత్రం 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్య్రం వచ్చిందన్నారు. 74 ఏండ్లు పూర్తై 75వ వడిలోకి అడుగేడుతున్న సందర్భంగా ఏడాది పాటు వజ్రో త్సవ సంబరాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ తీర్మానించారని పేర్కొన్నారు. ఈ సంబురాల్లో కులమతాలు, పార్టీలకతీతంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు ఉజ్వల భవి ష్యత్ ఉందని, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృ త్వంలో మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాక్షిం చారు. భావితరాలకు తెలిసొచ్చే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగిస్తున్నారని తెలిపారు. దేశంలో ఉన్న ఆయా రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుం టున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వేణు మాధవరావు, ఏసీబీ రవీందర్ రెడ్డి, ఎంపీడీఓ రాజ్ కుమార్, ఎంపీపీలు విజయలక్ష్మి రమణారెడ్డి, నక్షత్రం, గోవర్ధన్ రెడ్డి, ప్రశాంతి, జడ్పీటీసీలు జయ మ్మ, గోవిందమ్మ, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు శేరిరి శివారెడ్డి, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, చేవెళ్ల సర్పంచ్ బండారు శైలజాఆగిరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు గుండాల రాములు, ఏఎంసీ చైర్మన్ మద్దెల శివనీలచింటూ, పార్టీ మండలా ధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్, పామేల సర్పంచ్ మల్లారెడ్డి, మల్లారెడ్డిగూడ సర్పంచ్ మోహన్ రెడ్డి, సామ మణిక్య రెడ్డి, డైరెక్టర్లు యాదగిరి, అబ్దుల్ గని, నాయకులు పామేన విజరు, రామగౌడ్, నాగార్జున రెడ్డి, మిట్ట రంగారెడ్డి నరసింహులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఆయా కళాశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.