Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేశంపేట
మండల పరిధిలోని నిర్దవెళ్ళి గ్రామానికి నూతన బస్సు ఏర్పాటు చేయడం పట్ల ప్రజా ప్రతినిధులు, నాయ కులు, గ్రామస్తులు శనివారం హర్షం వ్యక్తం చేశారు. అఫ్జల్ గంజ్ నుండీ నిర్దవెళ్ళి మీదుగా మిడ్జిల్ వెళ్లే బస్సుకు గ్రామంలోని హనుమాన్ దేవాలయం వద్ద గ్రామసర్పంచ్ బడ్క పార్వతమ్మ వెంకటయ్య లాంఛనంగా పూజలు చేసి బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మా ట్లాడుతూ ఈ బస్సు ప్రారంభం కావడంతో గ్రామస్తులకు ఎంతో ప్రయాణ సౌకర్యం చేకూరుతుందని సంతోషం వ్యక్తం చేశారు. బస్సు నడిపే సమయాన్ని ప్రజలకు తెలిపా రు. ఫలక్ నుమ డీఎం జాకీర్ హుసేన్, సీఐ అరుణలకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదులు తెలిపారు. కార్యాక్ర మంలో ఎంపీటీసీ కిష్టమ్మ, ఉపసర్పంచ్ సిలివేరు మల్ల య్య, సింగల్ విండో డైరెక్టర్ కృష్ణయ్య, మాజీ వైస్ ఎంపీపీ సురెేందర్, మాజీ సర్పంచ్ జంగయ్య, టీఆర్ఎస్ గ్రామక మిటీ అధ్యక్షలు ఉమాపతి, సత్యనారాయణ, జంగయ్య, వెంకటేశ్, రామస్వామి నిరంజన్, సుధాకర్, మహేందర్, నాగరాజు, తిరుపతయ్య, రాములు, చంద్రయ్య, గ్రామ స్తులు తదితరులు పాల్గొన్నారు.