Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్
నవతెలంగాణ-ఆమనగల్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని జిల్లా పరిషత్ గ్రామీణాభివృద్ధిశాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులు, కడ్తాల్ మండల జెడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్‌నాయక్ అన్నా రు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన బంజారా భవన్ ప్రారంభానికి ఆమనగల్ కడ్తాల్ మండలాల నుంచి బంజా రాలు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కడ్తా ల్ మండల కేంద్రంలో బంజారాలు జాతీయ జెండాలతో భారీర్యాలీ నిర్వహించారు. అనంతరం గిరిజనులతో హైద రాబాద్‌కు తరలివెళ్తున్న వాహనాలను జెడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్, పీఏసీఎస్ చైర్మెన్ గంప వెంకటేష్ గుప్తా, ఎంపీడీఓ రామకృష్ణ, ఏపీఎం రాజేశ్వరి, ఏపిఓ మధుసూదనాచారి, రైతు సమన్వయ కమిటీ మండ లాధ్యక్షుడు జోగు వీరయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కంబాలపల్లి పరమేష్, వైస్ ఎంపీపీ ఆనంద్, ఎంపీటీసీలు లచ్ఛిరామ్ నాయక్, ప్రియా రమేష్, సర్పంచ్‌లు తులసిరామ్ నాయక్, భారతమ్మ నర్సింహ గౌడ్, డైరెక్టర్ సేవ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.