Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంట్వారం
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్క రించుకుని మండల కేంద్రంలో పలుచోట్ల జాతీయ పతాకా విష్కరణ చేశారు. బంట్వారం గ్రామపంచాయతీ కార్యాల యంలో స్థానిక సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రోహిత్ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్ సరళా రెడ్డి అధ్వర్యంలో కేజీబీవీ పాఠశాలలో ఇన్చార్జ్ స్పెషల్ ఆఫీసర్ శైలజ ఆధ్వర్యంలో పిఎసిఎస్ కార్యాలయంలో చైర్మన్ రాం చంద్రారెడ్డి ఆధ్వర్యంలో బస్స్టాండ్ హనుమాన్ మందిర్ ఆవరణలో బీజేపీ మండలాధ్యక్షులు మహేష్ ఆధ్వర్యంలో మం డల రెవిన్యూ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ బాలయ్య ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కర ణలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ షాధీపురం ప్రభాక ర్, ఎంపీడీఓ బాలయ్య, తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సర్పంచ్ లావణ్య శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు, అధికా రులు, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.