Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేశంపేట
ఎంపీపీ వై రవీందర్ యాదవ్ జన్మదిన వేడుకలను శనివారం ఎక్లాస్ఖాన్ పేటలోని ఆయన నివాస గృహం లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. బాణసంచాలు పేల్చి, శాలువ పూలమాలలతో సన్మానించారు. మండలంలోని అన్ని గ్రా మాల నుంచి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తండోపతండాలుగా కదలివచ్చి ఎంపీపీ శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీపీ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అభిమానులు స్వచ్ఛం దంగా ముందుకువచ్చి రక్తదానం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తాండ్ర విశాలశ్రావణ్ కుమార్ రెడ్డి, వైస్ ఎంపీపీ అనురాధ పర్వత్ రెడ్డి, పిఏసీఎస్ చైర్మన్ జగదీశ్వర్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు వెంకట్ రెడ్డి, నవీన్‌కుమార్, శ్రీలత శ్రీనివాస్, సావిత్రి బాల్‌రాజ్ గౌడ్, మల్లేష్ యాదవ్, మంజుల రాజశేఖర్ గుప్తా, మాజీ జడ్పి టిసి పల్లె నార్సింగ్రావు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మ న్ లక్ష్మీనారాయణ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ సురేందర్, నాయకులు శేఖర్ పంతులు, జగన్మోహన్ రెడ్డి, మురళీమో హన్, ధన్‌రాజ్ రెడ్డి, యాదగిరి రావు, ప్రభాకర్‌రెడ్డి, మల్ల య్య, కృష్ణయ్య, వెంకటయ్య, వెంకటేష్, నిరంజన్, రమేశ్ గౌడ్, ప్రేమ్ కుమార్ గౌడ్, దశరథం, గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.