Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్యూటీిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటప్ప
నవతెలంగాణ-ఫరూఖ్ నగర్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 17వ తేదీ ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరముందని లేనిపక్షంలో వాస్తవా లు తెలియక తెలంగాణ ప్రజానీకం మోసపోయే అవకాశ ముందని టీఎస్ యూటీఎఫ్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకటప్ప సూచించారు. శనివారం స్థానిక ఎమ్మార్సీ భవనంలో సెప్టెంబర్ 17 వాస్తవ చరిత్ర అనే అంశంపై టీఎస్‌యూటీఎఫ్ షాద్‌నగర్ డివిజన్ ఆధ్వర్యం లో ప్రధాన కార్యదర్శి బిజిలి సత్యం అధ్యక్షతన సెమి నార్ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి వెంక టప్ప హాజరై మాట్లాడుతూ.. భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరిని విముక్తి కోసం, భూస్వాములకు, జమీందారు లకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన పోరాటాలు తెలంగాణ ప్రజానీకానికి తెలియాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు వెంకటయ్య, జి. శివా రడ్డి ఎన్నర్సింలు, వలిగి కృష్ణ శివ రాములు, బి.నర్సింలు, జన విజ్ఞాన వేదిక నాయకులు బాలయ్య రాములు, సా యన్న భగవంథ్ రాజ్ వెంకటరమణ, సుధాకర్ రెడ్డి, కురు మయ్య, నాయకులు రవీంద్రనాథ్, పాల్గొన్నారు.