Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల పరిషత్ కార్యాలయంలో
- జాతీయ జెండా ఎగరవేసిన
- ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి
నవతెలంగాణ-కొత్తూరు
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్క రించుకుని శనివారం కొత్తూరు మండల పరిషత్ కార్యాల యంలో ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి జాతీయ జెండా ఎగరవేశారు. మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ రాములు ఆధ్వర్యంలో జెండావిష్కరణ కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లా డుతూ.. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఒక ప్రత్యే కమైన స్థానం ఉందన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం 3 రోజులపాటు నిర్వ హించ తలపెట్టిందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శరత్ చంద్రబాబు, డిప్యూటీ తహసీల్దార్ వెంకట్రాంరెడ్డి, ఆర్ఐ రాంబాబు, ఎంపీటీసీ ఎర్రవల్లి ప్రసన్న, మోడీ దర్శన్ తదితరులు పాల్గొన్నారు.