Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ నిఖిల
నవతెలంగాణ-మోమిన్ పేట
మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించుకో వ లసిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ నిఖిల తెలిపారు. శనివారం మోమిన్‌పేట్ మండలం పరిధిలోని మొరంగప ల్లి గ్రామప్రధాన రహదారికి ఇరువైపులా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమా నికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భం గా ఏర్పాటుచేసిన సభలో అమె మాట్లాడుతూ మొరం గపల్లి గ్రామపం చాయతీ పరిధిలో పెద్ద మొత్తంలో అవె న్యూ ప్లాంటేషన్ చేపట్టేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 వేల చెట్లను నాటేందుకు ముందుకు రావడం అభినంద నీయమన్నారు. మొక్కలు నాటడం కార్పోరేట్ సామాజిక బాధ్యతగా గుర్తించి 3 వేల మొక్కలను ఎస్బిఐ జిల్లా యం త్రాంగంతో కలిసి పనిచేస్తామని ఆమె అన్నారు. మొక్కలు నాటడం ప్రతీ ఒకరి బాధ్యతగా తీసుకుని ముందుకు రావా లని కలెక్టర్ ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు మొక్కలు నాటుకుని వాటిని సంరక్షించుకోవాలని అమె గ్రామస్తులకు సూచించారు. వ్యవసాయ పొలాల దగ్గర గట్లపైన చెట్లను పెంచేందుకు చర్యలు తీసుకోవా లని ఆమె కోరారు. గ్రామాల్లో ఉన్న దుకాణాల ముందు మొక్కలు నాటుకుని అవి పెద్దగా అయ్యేవరకు సంరక్షిం చుకోవలసిన బాధ్యత మనపై ఉందని అమె అన్నారు. గ్రామాల్లో ప్రతి వార్డులో, గ్రామం కూడలిలోని రోడ్లకు ఇరువైపులా చెట్లను పెంచేందుకు గ్రామస్తులందరూ బాధ్య త తీసుకుని ముందుకు వెళ్లాలని అమె సూచించారు. గ్రా మంలో గ్రామ పరిసరాల్లో నాటిన మొక్కలను కాపాడుకో వలసిన బాధ్యతను గ్రామ పంచాయతీ సిబ్బంది తీసుకోవా లని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో డి ఆర్డిఓ కృష్ణన్, జడ్పీ వైస్ ఛైర్మెన్ విజరు కుమార్, స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, డీజీఎం బాలనంద్ రీజియన్ మేనేజర్లు సివి రఘురాములు, రామకృష్ణ, లీడ్ బ్యాంకు మేనేజర్ రాంబా బు వికారాబాద్ చీఫ్ మేనేజర్ ఎ.విద్యాధర్, ఏపీవో శంకర్, పంచాయతీ కార్యదర్శి మాధవి, గ్రామస్తులు పాల్గొన్నారు.